Lata Mangeshkar: మధుర గాయనికి ఇంతకన్నా గొప్ప నివాళి ఏముంటుంది?.. లతాజీ అంత్యక్రియల్లో షారుఖ్‌ ఫొటో వైరల్‌..

తేనె కన్నా తియ్యనైన గొంతుతో కోట్లాది మంది హృదయాలు గెల్చుకున్న ఇండియన్‌ నైటింగెల్‌ లతా మంగేష్కర్ (Lata Mangeshkar) ఆదివారం మనందరినీ విడిచి పెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Lata Mangeshkar: మధుర గాయనికి ఇంతకన్నా గొప్ప నివాళి ఏముంటుంది?.. లతాజీ అంత్యక్రియల్లో షారుఖ్‌ ఫొటో వైరల్‌..
Lata Mangeshkar
Follow us

|

Updated on: Feb 07, 2022 | 10:52 AM

తేనె కన్నా తియ్యనైన గొంతుతో కోట్లాది మంది హృదయాలు గెల్చుకున్న ఇండియన్‌ నైటింగెల్‌ లతా మంగేష్కర్ (Lata Mangeshkar) ఆదివారం మనందరినీ విడిచి పెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కరోనా (Corona) బారిన పడి ముంబయి (Mumbai) లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె నిన్న ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె అభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక ఈ లెజెండరీ సింగర్‌ అంత్యక్రియలు ముంబయి లోని శివాజీ పార్కులో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఈక్రమంలో ఆమెను కడసారి దర్శించుకుని నివాళులు అర్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Narendra Modi) తో సహా పలు రాజకీయ, సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. అంత్యక్రియల్లో భాగంగా సోదరుడు హృదయనాథ్‌ మంగేష్కర్‌ లతాజీ చితికి నిప్పింటించారు.

ఇదే ఈ దేశంలో దాగిన అందం!..

ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే, మహారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోశ్యారీ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌, లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ దంపతులు, బాలీవుడ్ నుంచి అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ ఖాన్‌, ఆమీర్‌ఖాన్‌ తదితర ప్రముఖులు లతాజీకి తుది నివాళి అర్పించారు. కాగా షారుఖ్‌ తన మేనేజర్‌ పూజా దద్లానీతో కలిసి లతాజీ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. లెజెండరీ సింగర్‌ పాదాలను తాకి ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అయితే షారుఖ్‌ నివాళికి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్‌ గా మారింది. సోషల్‌ మీడియాలో ఇది బాగా సర్క్యులేట్‌ అవుతోంది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే.. లతాజీకి నివాళి అర్పించే క్రమంలో షారుఖ్‌ ఖాన్‌ ఇస్లాం సంప్రదాయం ప్రకారం చేతులు జోడించి అల్లాకు దువా చేస్తూ కనిపించగా.. ఆయనే పక్కన నిల్చున్న మేనేజర్‌ పూజా దద్లాని హిందూ సంప్రదాయ ప్రకారం చేతులు ముడుచుకుని ప్రార్థనలు చేస్తూ కనిపించారు. దీంతో ఈ ఫొటో నెట్టింట్లో బాగా వైరలవుతోంది. ‘భారతదేశం నిజమైన ఆత్మ ఇదే’, ‘భారతరత్నకు ఇదే అసలైన నివాళి’ ‘సంగీతానికి కులం, మతం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.