CM KCR Yadadri visit: శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ్మ‌స్వామిని ద‌ర్శించుకున్న సీఎం కేసీఆర్.. ఏరియ‌ల్ వ్యూ ద్వారా ఆల‌య పరిశీలన..

యాదాద్రిలోని బాలాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ్మస్వామిని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(CM KCR)  దర్శించుకున్నారు.  అనంతరం వేద పండితులు సీఎం కేసీఆర్ కు ఆశీర్వచనం అందించారు.

CM KCR Yadadri visit: శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ్మ‌స్వామిని ద‌ర్శించుకున్న సీఎం కేసీఆర్.. ఏరియ‌ల్ వ్యూ ద్వారా ఆల‌య పరిశీలన..
Cm Kcr
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 07, 2022 | 3:13 PM

యాదాద్రిలోని బాలాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ్మస్వామిని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(CM KCR)  దర్శించుకున్నారు.  అనంతరం వేద పండితులు సీఎం కేసీఆర్ కు ఆశీర్వచనం అందించారు. బాలాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. యాదాద్రి ఆలయ(Yadadri Temple) అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ మరోసారి పరిశీలించారు. మార్చి 28వ తేదీన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం(Government) ముహూర్తం నిర్ణయించింది. ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామి వారి దర్శనానికంటే ముందే కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ స్వరూంను పరిశీలించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, టీఆరెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు, విప్ గొంగిడి సునీత, సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నారు.

మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ దృష్ట్యా.. సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై ఆలయ పండితులు, అధికారులతో కేసీఆర్ సమీక్షించి, పలు సూచనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో పోలీసులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

యాదాద్రి లక్షీనరసింహ స్వామి ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అద్భుతంగా పునర్‌నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తొలినుంచీ ప్రత్యేక శ్రద్ధతో నిధులు కేటాయించారు సీఎం కేసీఆర్. కొండపైన, కింద అభివృద్ధి పనులు చేపట్టారు. అవన్నీ దాదాపు పూర్తయ్యాయి. కొన్నిచోట్ల ఫినిషింగ్‌ టచ్‌లో ఉన్నాయి. మార్చి 21 నుంచి మహాసుదర్శన యాగం జరుగుతుంది. గుట్టపై యాగస్థలి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు, పీఠాధిపతులు యోగులు, స్వామీజీలు, కోట్లాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యాల కల్పనపై అధికారులతో చర్చలు జరుపనున్నారు. కాగా, సీఎం పర్యటన దృష్ట్యా వైటీడీఏ అధికారులు అన్ని ఏర్పాట్ల పూర్తి చేశారు. మరోవైపు, యాదాద్రిలో భారీ బందోబస్తుతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలావుంటే, దేశంలో అద్భుతమైన పర్యాటక పుణ్యక్షేత్రంగా యాదాద్రిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పునర్‌ నిర్మిస్తోంది ప్రభుత్వం. 2014లో ప్రారంభించిన యాదాద్రి ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. ఇందుకోసం దాదాపు 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది. సీఎం కేసీఆర్‌ నిరంతరం ఈ పనులను పర్యవేక్షిస్తూ… అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.