Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారు.. ముచ్చింతల్‌లో ప్రత్యేక పూజలు

Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. మంగళవారం న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో..

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారు.. ముచ్చింతల్‌లో ప్రత్యేక పూజలు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 07, 2022 | 5:36 PM

Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. మంగళవారం న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4:40 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి 4:55 గంటలకు చేరుకుంటారు.

ఇక సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ముచ్చింతల్లోని రామానుజ చార్యుల విగ్రహ దర్శనం , 108 దివ్యదేశాల సందర్శన , యాగశాల పూజలో పాల్గొంటారు అమిత్‌ షా. రాత్రి 8 గంటలకు ముచ్చింతల్ నుంచి రోడ్డు మార్గాన ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు.

ఇవి కూడా చదవండి:

Owaisi Convoy Attack : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనపై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేసిన అమిత్‌ షా

NRIs Rallies: అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీకి ఎన్‌ఆర్‌ఐల మద్దతు.. కార్లతో భారీ ర్యాలీ