AP Corona Updates: ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. తాజాగా ఎన్ని కేసులంటే..
AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత రెండేళ్ల నుంచి..
AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత రెండేళ్ల నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఏపీ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. నిన్న 2,690 మందికి కరోనా సోకగా, తాజాగా గడిచిన 24 గంటల్లో 18,601 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇందులో 1,597 మంది కోవిడ్ బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం.. తాజాగా కరోనాతో విశాఖలో ఇద్దరు, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇక గడిచిన 24 గంటల్లో 8,766 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2305052 ఉండగా, యాక్టివ్ కేసుల సంఖ్య 62,395 ఉంది. ఇక 2227985 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 14,672 ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,26,79,288 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
కాగా, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కట్టడికి ఎన్నో చర్యలు చేపట్టారు. లాక్‌డౌన్, వ్యాక్సినేషన్, ఇతర ఆంక్షల కారణంగా ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేస్తున్నాయి రాష్ట్రాలు. తగ్గుముఖం పడుతున్న క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెంది మరింత ఆందోళనకు గురి చేసింది. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యాయి. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో మరింత ఆంక్షలు విధించాల్సి వచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.
ఇవి కూడా చదవండి: