వారి పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్..

రాష్ట్రంలో దొంగ పాస్టర్లు.. స్వాములు విచ్చలవిడిగా తిరుగుతున్నారని.. వారిపట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma).

వారి పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్..
Vasireddy Padma
Follow us

|

Updated on: Feb 07, 2022 | 4:33 PM

రాష్ట్రంలో దొంగ పాస్టర్లు.. స్వాములు విచ్చలవిడిగా తిరుగుతున్నారని.. వారిపట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma). ఇటీవల రాష్ట్రంలో సంచలనం రేపిన పాయకరావుపేట కీచక పాస్టర్ అరాచకాలపై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలు ఎదుర్కోంటున్న వేధింపులు.. అలాగే వారి అమయకత్వాన్ని ఆసరగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న దొంగ మతగురువులకు బుద్ధిచెప్పాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు.. ఎస్పీతో మాట్లాడారు.

సమాజంలో కొంతమంది చీడపురుగులు దొంగ పాస్టర్లుగా, స్వాములుగా యథేచ్ఛగా తిరుగుతున్నారని… అటువంటి కీచక మతబోధకుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. పాయకరావుపేటలో పాస్టర్ ముసుగులో మహిళలను లైంగికవేధింపులకు గురిచేసిన ఘటనపై వాసిరెడ్డి పద్మ సోమవారం తీవ్రంగా స్పందించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే, ఎస్పీలతో ఆమె ఫోన్ లో మాట్లాడారు. కఠిన శిక్షలతో దొంగ మత గురువులకు బుద్ధిచెప్పాలని ఆదేశించారు. ఈమేరకు విశాఖపట్నం ఎస్పీకి మహిళా కమిషన్ నుంచి అధికారికంగా లేఖ పంపామన్నారు. ప్రేమస్వరూపి మందిరం బందీ నుంచి విముక్తి పొందిన బాధితుల కౌన్సిలింగ్ కు ఆమె ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పాయకరావుపేట దొంగ పాస్టర్ కీచకపర్వం ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది మతబోధకుల ముసుగులో మహిళలను లోబరుచుకునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆమె మండిపడ్డారు. వీరి మాటల చాటున ఉన్న మర్మాన్ని మహిళలు పసిగట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పోలీసులు కఠినంగా శిక్షించేలా మహిళా కమిషన్ కృషి చేస్తుందని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

కృష్ణ జిల్లా కృష్ణలంకకు చెందిన అంబటి అనిల్ కుమార్.. ప్రేమదాసు పేరుతో పాయకరావుపేటలో మతభోదనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన ఓ యువతిని ఇక్కడ జరుగుతున్న ఆకృత్యాలు, తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రేమదాసు డొంకంతా కదిలింది. ప్రేమ స్వరుపి యూట్యూబ్ ఛానెల్‌ను ఏర్పాటు చేసి డబ్బుల వసూళ్లకు పాల్పడేవాడని.. 30 మంది మహిళలను దేవుని సేవ పేరుతో నగదు వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పాస్టర్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పాయకరావు పేట పోలీసులు తెలిపారు.

Also Read: Lata Mangeshkar: రాజ్‌కపూర్‌పై అలిగిన లతా మంగేష్కర్.. ఎందుకు అలా చేసిందంటే..

Lata Mangeshkar: అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రేమ వాళ్లది.. లతా మంగేష్కర్ ప్రేమ ద్వేషంగా ఎందుకు మారిందో తెలుసా..

Pawan Kalyan-Statue of Equality: సమతామూర్తి భగవద్ రామానుజాచార్య సన్నిధిలో ‘పవన్ కళ్యాణ్’.. చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న ‘జనసేనని’ ఫొటోస్..

Shruti Haasan: పచ్చని ప్రకృతి నడుమ ఫోటోలకు ఫోజులిచ్చిన ‘శ్రుతి హాసన్’ సొగసులు చూడతరమా..(ఫొటోస్)