Uniform Measurements: వివాదంగా మారిన మహిళా పోలీస్ యూనిఫామ్ కొలతల వ్యవహారం.. స్పందించిన నెల్లూరు జిల్లా ఎస్పీ..
మహిళా పోలీసుల యూనిఫామ్ కొలతల వ్యవహారం వివాదంగా మారింది. పోలీసు యూనిఫామ్ కొలతలు పురుషులు తీసుకుంటుండంతో మహిళా పోలీసులు అభ్యంతరం వ్యక్తం..
Lady Constable Uniform: మహిళా పోలీసుల యూనిఫామ్ కొలతల వ్యవహారం వివాదంగా మారింది. పోలీసు యూనిఫామ్ కొలతలు పురుషులు తీసుకుంటుండంతో మహిళా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మరింత వివాదంగా మారుతుండటంతో వెంటనే స్పందించారు నెల్లూరు ఎస్.పి.విజయా రావు. మహిళా పోలీసులకు సంబంధించి యూనిఫామ్ బాధ్యతలను ఔట్ సౌర్చింగ్ కు అప్పచెప్పామని వెల్లడించారు. ఒక పురుషుడు కొలతలు తీసినట్లు తెలిసిన వెంటనే స్పందించి దానిని సరిదిద్దామని వెల్లడించారు. మహిళా టైలర్లు.. మహిళా పోలీస్ సిబ్బంది కూడా వారిలో ఉన్నారు. ఒక మీడియా ఫోటోగ్రాఫర్ నిబంధనలకు విరుద్దంగా ప్రాంగణంలోకి ప్రవేశించి ఫోటోలు తీశారన్నారు. సున్నితమైన విషయాన్ని రాజకీయం చేయొద్దని అన్నారు. మహిళలను కించపరిచే విధంగా పోస్టింగులు పెట్టటం సరికాదన్నారు. పోలీస్ డ్రెస్ కుట్టే మహిళా టైలర్స్ జిల్లాలో లేరు.. పోలీస్ డ్రెస్ కుట్టే టైలర్స్ ని ఏర్పాటు చేసాం. మహిళా కానిస్టేబుల్స్ మెజర్ మెంట్స్ తీస్తే , కొలతలు టైలర్స్ నోట్ చేసుకొన్నారు. కొలతలు ఎలా తీయాలో చూపించే సమయంలో అజ్ఞాత వ్యక్తి ఫోటో తీసి ట్రోల్ చేసాడు.
మహిళల ప్రైవసీకి భంగం కలిగించినందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రక్రియకు ఏ.ఎస్.పి వెంకటరత్నమ్మ ఇంచార్జి గా ఉన్నారని.. మహిళా పోలీసుల దుస్తుల కొలతలు తీసేందుకు మహిళలనే నియమించామని నెల్లూరు ఎస్.పి.విజయా రావు స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ పై ఎస్పీ క్రమశిక్షణా చర్యలు తీసుకొన్నారు.
ఇదిలావుంటే.. నెల్లూరు మహిళ పోలీస్ యూనిఫామ్ కొలతల కు సంబంధించిన ఘటన పై ఏపీ మహిళా కమిషన్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. పురుష టైలర్ తో మహిళా పోలీస్ యూనిఫామ్ కొలతల తియ్యడంపై నెల్లూరు ఎస్పీతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మమాట్లాడినట్లుగా సమాచారం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరక్కుండా చూస్తామని నెల్లూర్ ఎస్పీ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. మహిళా పోలీసుల డ్రెస్ కొలతను పురుషులు తీసుకోవడాన్ని కొందరు లెఫ్టె పార్టీల నేతలు తప్పు పట్టారు.
ఇవి కూడా చదవండి: CM KCR Yadadri visit: శ్రీలక్ష్మీ నరసింహ్మస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్.. ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిశీలన..