Road Accident: ఐదు రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే విషాదం..!

Road Accident: వారంలో పెళ్లి పీటలు ఎక్కి వివాహం చేసుకుని నూతన జీవితం ప్రారంభించాల్సిన పెళ్ళికొడుకు.. అంతలోనే కాలం..

Road Accident: ఐదు రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే విషాదం..!
Road Accident
Follow us
TV9 Telugu

| Edited By: Subhash Goud

Updated on: Feb 07, 2022 | 3:09 PM

Road Accident: వారంలో పెళ్లి పీటలు ఎక్కి వివాహం చేసుకుని నూతన జీవితం ప్రారంభించాల్సిన పెళ్ళికొడుకు.. ఇంతలోనే కాలం చిన్నచూపు చూడడంతో విధిరాతకు బలై ప్రమాదంలో మరణించిన ఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం వడ్డేమాను గ్రామంలో చోటుచేసుకుంది. నందికొట్కూరు మండలం అల్లూరు రోడ్డు సమీపంలో  రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీకొని సోమశేఖర్‌, నాగరాజు అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

సోమశేఖర్‌కు ఈనెల 12న వివాహం జరగాల్సి ఉంది.  పెళ్లి పనుల నిమిత్తం నందికొట్కూరు నుండి వడ్డెమాను బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో మృతుడు నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మరణంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

చనిపోయిన ఫ్రెండ్ రమ్మని పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా.. సెల్ టవర్ ఎక్కి హల్ చల్

Murder: రూ.900కోసం తండ్రిని చావబాదిన కుమారుడు.. ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా చిత్రహింసలు.. చివరికి..?