Murder: రూ.900కోసం తండ్రిని చావబాదిన కుమారుడు.. ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా చిత్రహింసలు.. చివరికి..?
మనీ సంబంధాలు మనుషుల మధ్య బంధాలను దూరం చేస్తున్నాయి. డబ్బుకోసం సొంతవారిపైనే కొందరు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా తండ్రికి వచ్చే పింఛన్ డబ్బులను తనకు ఇవ్వాలని కుమారుడు కోరాడు.
మనీ సంబంధాలు మనుషుల మధ్య బంధాలను దూరం చేస్తున్నాయి. డబ్బుకోసం సొంతవారిపైనే కొందరు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా తండ్రికి వచ్చే పింఛన్ డబ్బులను తనకు ఇవ్వాలని కుమారుడు కోరాడు. డబ్బు ఇచ్చేందుకు తండ్రి నిరాకరించడంతో తీవ్రంగా కొట్టి హతమార్చాడు. ఇంతకీ ఎంత డబ్బో అనుకుంటున్నారా..? కేవలం రూ.900 కోసమే. విస్మయానికి గురి చేస్తున్న ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా జవహర్ ప్రాంతంలో జాను మాలి నివసిస్తున్నాడు. తనకు వచ్చే పింఛన్ డబ్బుల నుంచి రూ. 900ను బ్యాంకు ఖాతా నుంచి విత్ డ్రా చేశాడు. ఆ డబ్బును తనకు ఇవ్వాలని కుమారుడు రవీంద్ర మాలి అడగగా.. ఇచ్చేందుకు జాను నిరాకరించారు. ఈ ఘటనతో రవీంద్ర తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. తండ్రి రవీంద్ర మాలిని చితకబాదాడు.
గమనించిన కుటుంబసభ్యులు రవీంద్ర మాలిని మొఖాడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నాసిక్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. నిందితుడు రవీంద్ర మాలి తన తండ్రి జానూ మాలిని నాసిక్‌కు తరలించకుండా ఇంటికి తీసుకెళ్లాడు. మరుసటి రోజే జాను మాలి చనిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రవీంద్ర మాలిని అరెస్ట్ చేసి, మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Also Read
ఓలా ఎలక్ట్రిక్ పోటీగా మరో కొత్త స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌పై 120 కిలోమీటర్ల రేంజ్
NRI News: అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్‌న్యూస్.. కొత్త చట్టాన్ని ఆమోదించిన అగ్రరాజ్యం..