AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arrest: డబ్బు కోసం బ్లాక్ మెయిల్.. బెడిసికొట్టిన ప్లాన్.. నలుగురు అరెస్టు

వైద్యుడిని బెదిరించి డబ్బు వసూలు చేయాలని ప్రయత్నించిన ముఠాను గుంటూరు నగరంలోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. సులభంగా డబ్బులు సాధించాలని ప్లాన్ వేసి పోలీసులకు దొరికిపోయారు. నిందితుల్లో ఒకరు..

Arrest: డబ్బు కోసం బ్లాక్ మెయిల్.. బెడిసికొట్టిన ప్లాన్.. నలుగురు అరెస్టు
Doctor Kidnap
Ganesh Mudavath
|

Updated on: Feb 07, 2022 | 12:47 PM

Share

వైద్యుడిని బెదిరించి డబ్బు వసూలు చేయాలని ప్రయత్నించిన ముఠాను గుంటూరు నగరంలోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. సులభంగా డబ్బులు సాధించాలని ప్లాన్ వేసి పోలీసులకు దొరికిపోయారు. నిందితుల్లో ఒకరు.. గతంలో వైద్యుడి వద్ద పనిచేసిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గుంటూరు నగరంలో డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, డాక్టర్ నీలిమ దంపతులు సత్య హాస్పటల్‌ నిర్వహిస్తున్నారు. గణేశ్ అనే వ్యక్తి వీరి వద్ద కొంతకాలం వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత వేరే చోట పనికి కుదిరాడు. గణేశ్​కు దేవీప్రసాద్, మధుసుదనరావు, అక్బర్ బాషా అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేవీప్రసాద్.. తనకు అత్యవసరంగా డబ్బు కావాలని, ఏం చేయాలో అర్థం కావటం లేదని గణేశ్ వద్ద వాపోయాడు. దీంతో తాను ఇంతకు ముందు పనిచేసిన డాక్టర్ వద్ద చాలా డబ్బు ఉందని, ఆ డాక్టర్ చాలా భయస్థుడని, చంపుతామని బెదిరిస్తే అడిగినంత డబ్బు ఇస్తాడని గణేశ్ దేవీప్రసాద్​కు చెప్పాడు. ఈ క్రమంలో గణేశ్ తన స్నేహితులతో కలిసి వైద్యుడిని బ్లాక్ మెయిల్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తి సెల్​ఫోన్​ను గణేశ్ కొట్టేశాడు. ఆ ఫోన్ తో డాక్టర్​కు కాల్ చేశారు. “కొంత మంది వ్యక్తులు మిమ్మల్ని చంపడానికి రూ.70 లక్షలు సుపారీ ఇచ్చారు. మీ వివరాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఆ డబ్బును మీరే ఇస్తే మిమ్మల్ని వదిలేసి సుపారీ ఇచ్చిన వారిని చంపుతాం” అని డాక్టర్​ను బెదిరించాడు. ఈ లోపు సెల్​ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి తన సిమ్ బ్లాక్ చేయించటంతో నిందితులు అక్బర్ బాషా ఫోన్ నుంచి కాల్ చేసి బెదిరించటం మెుదలుపెట్టాడు.

ఊహించని ఘటనతో భయపడిపోయిన డాక్టర్ డబ్బు ఎక్కడికి తీసుకురావాలని నిందితులను అడిగాడు. మళ్లీ ఫోన్ చేసి చెబుతామని నిందితులు ఫోన్ కట్ చేశారు. ఈ లోపు వైద్యుడు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్​ నంబర్ల ఆధారంగా రెడ్డిపాలెం బ్రహ్మంగారివీధికి చెందిన నల్లిబోయిన గణేష్‌, శారదాకాలనీ 27వ లైనుకు చెందిన దాసరి దేవిప్రసాద్‌, అరండల్‌పేట 3/6కు చెందిన అన్నమనేడి మదుసూధనరావు, వినోభానగర్‌ 4వ లైనుకు చెందిన షేక్‌ అక్బర్‌ బాషాలను కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు.

ఇవీచదవండి.

Punjab Elections: కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చన్నీ ఎంపికపై సొంత పార్టీలో అసమ్మతి.. అమృత్‌సర్‌లో నిరసనలు!

Punjab Elections: కాంగ్రెస్ ముఖ్యమంత్రి మహా శివుడి ఆలయంలో పంజాబ్‌ సీఎం ప్రత్యేక పూజలు.. దర్శనానంతరం ఏం మాట్లాడారంటే..

Corona Vaccine: రోజుకో రూపాన్ని సంతరించుకుంటున్న కరోనాకు భారత శాస్త్రవేత్తలు చెక్.. అన్ని వేరియంట్స్ ఒకే టీకా అబివృద్ధి..