Corona Vaccine: రోజుకో రూపాన్ని సంతరించుకుంటున్న కరోనాకు భారత శాస్త్రవేత్తలు చెక్.. అన్ని వేరియంట్స్‌కు ఒకే టీకా అబివృద్ధి..

Corona Vaccine: రెండేళ్ళ క్రితం చైనా(China)లో వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాలను అప్పటి నుంచి పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్(Corona Virus). ఈ మహమ్మారి వైరస్ రోజుకోరూపాన్ని సంతరించుకుని..

Corona Vaccine: రోజుకో రూపాన్ని సంతరించుకుంటున్న కరోనాకు భారత శాస్త్రవేత్తలు చెక్.. అన్ని వేరియంట్స్‌కు ఒకే టీకా అబివృద్ధి..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 07, 2022 | 8:50 PM

Corona Vaccine: రెండేళ్ళ క్రితం చైనా(China)లో వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాలను అప్పటి నుంచి పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్(Corona Virus). ఈ మహమ్మారి వైరస్ రోజుకోరూపాన్ని సంతరించుకుని మానవాళిపై విరుచుకుపదుతోంది. ఈ కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి.. అంతమొందించడానికి శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు పలు రకాల టీకాలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా భాతర శాస్త్రవేత్తలు అన్నిరకాల వేరియంట్లపైనా సమర్థవంతంగా పనిచేసే సార్వత్రిక టీకాను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఇది పెప్టైడ్‌ వ్యాక్సిన్‌. పశ్చిమ బెంగాల్‌లోని కాజీ నజ్రుల్‌ విశ్వవిద్యాలయం, భువనేశ్వర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించారు. ఈ టీకాకు ‘అభిఎస్‌సీవో వ్యాక్‌’ అని పేరు పెట్టారు. దీని తయారీ కోసం ఇమ్యునోఇన్ఫర్మేటిక్‌ విధానాలను అనుసరించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇది కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2తోపాటు ఆ తరగతికి చెందిన ఆరు వైరస్‌లపై సమర్థంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి టీకా మరొకటి ప్రపంచంలో ఎక్కడా లేదని వారు తెలిపారు. ఆరు భిన్న వైరస్‌లలో స్పైక్‌ ప్రొటీన్‌లో కొన్ని భాగాలు చాలా తక్కువగా ఉత్పరివర్తనాలకు లోనవుతున్నట్లు మొదట గుర్తించామని తెలిపిన శాస్త్రవేత్తలు.. వీటిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మానవ శరీరంలో రోగ నిరోధక స్పందనను కలిగించొచ్చని తెలిపారు. స్పైక్‌ ప్రొటీన్‌లోని ఈ భాగాలకు టీఎల్‌ఆర్‌4 అనే ప్రొటీన్‌తో బలమైన బంధాన్ని ఏర్పరిచే సామర్థ్యం ఉందన్నారు. కరోనా వైరస్‌ను గుర్తించి, రోగ నిరోధక స్పందనను కలిగించడంలో ఈ ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

Also Read:

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 ఆహారాలు తప్పనిసరి.. ఏంటో తెలుసుకోండి..?

ఏడ్చే పాప ఊరుకోవాలంటే… శ్రీవల్లి స్టెప్ వేయాల్సిందే..! వైరల్ అవుతున్న వీడియో

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి