ఓలా ఎలక్ట్రిక్ పోటీగా మరో కొత్త స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌పై 120 కిలోమీటర్ల రేంజ్‌

AMO Electric Bikes: ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో కొత్త స్కూటర్ వచ్చింది. ఈ స్కూటర్ పేరు జాంటీ ప్లస్. దీనిని AMO ఎలక్ట్రిక్ బైక్స్ పరిచయం చేసింది.

ఓలా ఎలక్ట్రిక్ పోటీగా మరో కొత్త స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌పై 120 కిలోమీటర్ల రేంజ్‌
Amo Electric Jaunty
Follow us
uppula Raju

|

Updated on: Feb 07, 2022 | 1:02 PM

AMO Electric Bikes: ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో కొత్త స్కూటర్ వచ్చింది. ఈ స్కూటర్ పేరు జాంటీ ప్లస్. దీనిని AMO ఎలక్ట్రిక్ బైక్స్ పరిచయం చేసింది. ఇది మెరుగైన పనితీరుతో సూపర్‌ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిమీల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. ఓలా స్కూటర్, బజాజ్ చేతక్‌లకు గట్టి పోటినిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1,10,460 (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో తయారైన బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది.

జాంటీ ప్లస్ క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్‌తో సహా అనేక మంచి ఫీచర్లతో వస్తుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రెడ్-బ్లాక్, గ్రే-బ్లాక్, బ్లూ-బ్లాక్, వైట్-బ్లాక్, ఎల్లో-బ్లాక్ కలర్ అనే ఐదు రంగులలో పరిచయం చేసింది. అంతేకాకుండా మూడు సంవత్సరాల వారంటీని అందిస్తుంది. దీనికి కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయి. jonty Plus Scootrumలో 60V/40Ah అధునాతన లిథియం బ్యాటరీ ఉపయోగించారు.

దీని సాయంతో వినియోగదారులు 120 కిమీల డ్రైవింగ్ పరిధిని పొందుతారు. ఈ-బైక్‌లో అధిక పనితీరు గల మోటారు, క్రూయిజ్ కంట్రోల్ స్విచ్, ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (EABS), యాంటీ-థెఫ్ట్ అలారం ఉన్నాయి. ఇది కాకుండా టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, హై గ్రౌండ్ క్లియరెన్స్, సైడ్ స్టాండ్ సెన్సార్, సెంట్రల్ లాకింగ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, DRL లైట్లు, ఇంజన్ కిల్ స్విచ్ ఉన్నాయి.

4 గంటల్లోనే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్

జాంటీ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సగటున120 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. ఇది బ్రష్‌లెస్ DC మోటార్‌ను కలిగి ఉంటుంది. వేగంగా ఛార్జ్ అవుతుంది పూర్తిగా ఛార్జ్ చేయడానికి గరిష్టంగా 4 గంటల సమయం పడుతుంది. జాంటీ ప్లస్ మొబైల్ USB ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది. ఇది మెరుగైన భద్రత కారణంగా భిన్నంగా ఉంటుంది. జాంటీ ప్లస్ స్కూటర్ ఓలా ఎస్1, ఎలక్ట్రిక్ బజాజ్ చేతక్‌తో పోటీపడుతుంది. సింపుల్ వన్‌తో సహా ఓలా స్కూటర్‌కు మంచి జనాదరణ లభించిందని, దాని బుకింగ్ నంబర్‌ను బట్టి అంచనా వేయవచ్చు.

PM Modi: అనంతపురం రోడ్డు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా..

SBI SCO Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. స్టేట్‌ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..?

Booster Shot: బూస్టర్ డోస్‌ తీసుకున్న తర్వాత చాలామందిలో ఈ సైడ్‌ ఎఫెక్ట్‌.. ఎందుకంటే..?