AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telegram: మెసేజ్‌లు ఏ భాషలో వచ్చినా సరే.. మీకు నచ్చిన భాషలో చదువుకోవచ్చు. టెలిగ్రామ్‌లో ఆసక్తికర ఫీచర్‌..

Telegram: తెలియని భాష ఎవరికైనా ఇబ్బందే, మనకు రాని భాషలో సంభాషించడం కష్టమవుతుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియా యుగంలో చాటింగ్ ప్రాధాన్యత బాగా పెరిగింది. చాలా మంది కమ్యూనికేషన్‌ అంతా చాటింగ్ రూపంలోనే చేసేస్తున్నారు. అయితే..

Telegram: మెసేజ్‌లు ఏ భాషలో వచ్చినా సరే.. మీకు నచ్చిన భాషలో చదువుకోవచ్చు. టెలిగ్రామ్‌లో ఆసక్తికర ఫీచర్‌..
Narender Vaitla
|

Updated on: Feb 07, 2022 | 8:13 AM

Share

Telegram: తెలియని భాష ఎవరికైనా ఇబ్బందే, మనకు రాని భాషలో సంభాషించడం కష్టమవుతుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియా యుగంలో చాటింగ్ ప్రాధాన్యత బాగా పెరిగింది. చాలా మంది కమ్యూనికేషన్‌ అంతా చాటింగ్ రూపంలోనే చేసేస్తున్నారు. అయితే మనకు తెలియని భాషలో మెసేజ్‌లు వస్తే అర్థం చేసుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. ఇలాంటి వారికోసమే టెలిగ్రామ్‌ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తూ.. యూజర్లను ఆకర్షిస్తోన్న టెలిగ్రామ్‌ తాజాగా ట్రాన్స్‌లేషన్‌ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో ఇకపై కమ్యూనికేషన్‌ గ్యాప్‌ అన్న మాటే ఉండదు.

ఈ ఫీచర్‌ టెలిగ్రామ్‌ యాప్‌లో మీకు వచ్చిన మెసేజ్‌లు వెంటనే మీరు ఎంచుకున్న లాంగ్వేజ్‌లోకి ఆటోమెటిక్‌గా మార్చేస్తుంది. ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక టెలిగ్రామ్‌లో ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకోవడానికి ముందుగా టెలిగ్రామ్ యాప్ ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం అక్కడ ఉన్న లాంగ్వేజ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే ‘షో ట్రాన్స్‌లేషన్‌’ అనే బటన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్‌ చేస్తే 18 అంతర్జాతీయ భాషల జాబితా కనిపిస్తుంది. ఆ జాబితాలో మీకు ఇష్టమైన భాషను ఎంచుకుంటే మీకు వచ్చిన మెసేజ్‌ వెంటనే ఆ భాషలోకి మారుతుంది. అలాగే షో ట్రాన్స్‌లేషన్‌ ఆప్షన్‌ కింద డునాట్‌ ట్రాన్స్‌లేట్‌ అనే ఆప్షన్‌ కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి.. మీకు ట్రాన్స్‌లేషన్‌ అవసరం లేని భాషను సెలక్ట్ చేసుకోవచ్చు.

ఇలా చేయడం వల్ల మెసేజ్‌ మీరు సెలక్ట్‌ చేసుకున్న భాషలోకి ట్రాన్సలేట్‌ కాదు. అయితే అంతా బాగానే ఉన్నా.. ఈ ఫీచర్‌ మాత్రం ప్రస్తుతానికి భారతీయ భాషల్లో అందుబాటులో లేదు. అయితే భవిష్యత్తులో టెలిగ్రామ్‌ ఈ దిశలో కూడా ఆలోచన చేసే అవకాశాలు లేకపోలేదు. కారణం.. భారత్‌లో టెలిగ్రామ్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒకవేళ ఈ ఫీచర్‌ ఇండియన్‌ భాషల్లో కూడా అందుబాటులోకి వస్తే యూజర్లకు పండగే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Also Read: UP Elections 2022: 45 మంది బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల.. బల్లియా నుండి స్వాతి సింగ్ భర్త దయాశంకర్

Elections 2022: ఈసీ కీలక నిర్ణయం.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పార్టీలకు కాస్త ఊరట..

Watch Video: మైదానంలో కెమిస్ట్రీతో కేక పుట్టించిన కోహ్లీ-రోహిత్.. వివాదాలకు స్వస్తి పలకాలంటోన్న ఫ్యాన్స్..!