Google Chrome: ఎనిమిదేళ్ల తర్వాత లోగోను మార్చేసిన గూగుల్.. ఫన్నీ కామెంట్స్ చేస్తోన్న నెటిజన్లు..
Google Chrome: ఇంటర్‌నెట్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది గూగుల్. ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉందో లేదో చెక్ చేయడానికి కూడా యూఆర్‌ఎల్‌లో గూగుల్‌ను టైప్ చేసి చెక్ చేసే వారు చాలా మంది. ఎన్నో రకాల వెబ్ బ్రౌజర్లు అందుబాటులో ఉన్నా..
Google Chrome: ఇంటర్‌నెట్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది గూగుల్. ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉందో లేదో చెక్ చేయడానికి కూడా యూఆర్‌ఎల్‌లో గూగుల్‌ను టైప్ చేసి చెక్ చేసే వారు చాలా మంది. ఎన్నో రకాల వెబ్ బ్రౌజర్లు అందుబాటులో ఉన్నా చాలా మందికి తెలిసింది మాత్రం గూగుల్. అంతలా పాపుల్ అయిందీ సెర్చ్ ఇంజన్. ఇక గూగుల్ అనగానే రౌండ్ షేప్‌లో ఉండే ఒక ఆకారం గుర్తొస్తుంది అదే గూగుల్ లోగో. అడపాదడపా గూగుల్ ఈ లోగోలో మార్పులు చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి గూగుల్ లోగో మార్పు చేసింది.
2014 తర్వాత గూగుల్ మరోసారి లోగో మార్పులు చేసింది. కొత్త లోగోను గూగుల్ క్రోమ్ డిజైనర్ ఎల్విన్ హు తన ట్విటర్ వేదికగా షేర్ చేశారు. క్రోమ్ కొత్త ఐకాన్‌ను మీరు ఇవాళ గమనించే ఉంటారు. 8 ఏళ్ల తర్వాత క్రోమ్ బ్రాండ్ ఐకాన్‌ను రిఫ్రెష్ చేస్తున్నాం’ అని పోస్ట్ చేశారు. అయితే గూగుల్ ఈ లోగోలో కేవలం స్వల్ప మార్పులు మాత్రమే చేసింది. పాత లోగోకు కొత్త లోగోకు స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. లోగోలో ఉండే రెడ్, గ్రీన్, యల్లో కలర్స్‌ను కాస్త బ్రైట్‌గా మార్చారు. అలాగే మధ్యలో ఉండే బ్లూ కలర్‌ను పెద్దగా చేసి దాన్ని కూడా బ్రైట్ చేశారు.
అయితే గూగుల్ చేసిన ఈ మార్పులపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. లోగోలో మార్పు అంటే ఇదేనా అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. దీనికి కారణం.. పరిశీలించి చూస్తే కానీ లోగోలో చేసిన మార్పులు కనిపించకపోవడమే. దీంతో పలు ఫన్నీ మీమ్స్‌తో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. మరి నెట్టింట వైరల్‌గా మారిన అలాంటి కొన్ని ఫన్నీ మీమ్స్‌ను చూసేయండి..
#GoogleChrome New logo. Spot the difference ?
2014 2022 pic.twitter.com/lJXL7zqgjs
— Sonu Prajapati (@TechMumbaikar) February 6, 2022
After seeing the Google chrome logo change: pic.twitter.com/or6xEP1fq3
— Falebi Jafda (@GoggleWalaMemer) February 6, 2022
Jio, Airtel, Vi: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ రీఛార్జ్ ప్లాన్‌లు.. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు..
Anand Mahindra: అక్కడికి వెళ్తే ఆ పిజ్జా రెస్టారెంట్‌లోనే భోజనం చేస్తా.. ఆనంద్ మహీంద్రా ట్వీట్..