- Telugu News Photo Gallery Technology photos Motorola launching new smartphone moto g stylus 2022 have a look on features and price
Moto G Stylus: 50 మెగాపిక్సెల్‌తో మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ బడ్జెట్‌లోనే..
Moto G Stylus 2022: మోటోరాలో మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. మోటో జీ స్టైలస్ 2022 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ మరికొన్ని రోజుల్లో భార మార్కెట్లోకి రానుంది. తక్కువ బడ్జెట్‌లో ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్ సొంతం..
Updated on: Feb 06, 2022 | 12:59 PM

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరోలా ఇటీవల వరుసగా కొత్త ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మోటో జీ స్టైలస్-2022 (Moto G Stylus) పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది.

ప్రస్తుతం అమెరికాలో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లో సందడి చేయనుంది. తక్కువ బడ్జెట్‌లో ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్‌ను రూపొందించారు.

ఈ ఫోన్‌లో 6.8 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ ప్లస్, మాక్స్ విజన్ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ డిస్‌ప్లే సొంతం.

ఇక ఇందులో ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియో జీ88 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. కెమెరాకు అధిక ప్రాధానత్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్‌తో కూడిన ఈ ఫోన్ ధర రూ. 22,400గా ఉంది. ఇందులో 10 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.




