Jio, Airtel, Vi: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ రీఛార్జ్ ప్లాన్‌లు.. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు..
Jio, Airtel, Vi: భారతదేశపు మూడు ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ తమ యూజర్ల కోసం అదిరిపోయే
Jio, Airtel, Vi: భారతదేశపు మూడు ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ తమ యూజర్ల కోసం అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఈ మూడు కంపెనీల చౌకైన రిఛార్జ్ ప్లాన్ల గురించి తెలుసుకుందాం. ప్లాన్ ధరలు, ప్రయోజనాల విషయంలో రెండు కంపెనీల కంటే జియో ఒకడుగు ముందుంటుంది. Jio కొన్ని రోజుకి 1GB, 2GB ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇవన్నీ తక్కువ వ్యాలిడిటీ అందిస్తాయి తక్కువ ధరకి వస్తాయి. మొదటి ప్లాన్ ధర రూ.149, వ్యాలిడిటీ 20 రోజులు. రోజుకు 1GB డేటా అందిస్తుంది. వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలను పొందుతారు.
రూ.179తో వినియోగదారులు రోజుకు 1GB డేటా 24 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్ కాల్‌లు రోజుకు 100 SMSలతో వస్తుంది. 209 రూపాయల జాబితాలో రోజుకు 1GB డేటా 28 రోజుల వ్యాలిడిటీతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లు రోజుకు 100 SMSలను అందిస్తుంది. రూ.300లోపు టెల్కో 2GB ప్యాక్‌లను ఆఫర్ చేస్తుంది. మొదటి ప్లాన్ ధర రూ.249, వ్యాలిడిటీ 23 రోజులు. రోజుకు 2GB డేటాను అందిస్తుంది. మరోవైపు రూ.299 ధరతో రోజుకు 2GB డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్ కాల్‌లు రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఈ అన్ని ప్లాన్‌లతో వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ వంటి జియో అప్లికేషన్‌లకు యాక్సెస్ పొందుతారు.
భారతి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు
భారతి ఎయిర్‌టెల్ కస్టమర్లకు కొన్ని అదనపు ప్రయోజనాలతో ప్లాన్లని అందిస్తుంది. మొదటి ప్లాన్ ధర రూ.209, వ్యాలిడిటీ 21 రోజులు, రోజుకు 1GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ రోజుకు 100 SMS లతో వస్తుంది. తదుపరి ప్యాక్ రూ.239 ప్లాన్ ఇది రోజుకి 1GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMSలు, 24 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రూ.265 ప్లా్‌న్‌లో రోజుకు 1GB డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్ కాల్‌లు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అన్ని ప్లాన్‌లు Wynk సంగీతానికి యాక్సెస్‌తో వస్తాయి.
వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌లు
Vodafone Idea తన వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి దేశవ్యాప్తంగా తన 4G సేవను విస్తరిస్తోంది. సరసమైన విభాగంలో VI కొన్ని రోజుకి 1GB డేటా ప్యాక్‌లను అందిస్తుంది. VI ప్రవేశపెట్టిన మొదటి ప్లాన్ 18 రోజుల వ్యాలిడిటీ, రూ.199 ధరతో వస్తుంది. ఇది రోజుకు 1 GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లు రోజుకు 100 SMSలను అందిస్తుంది. తదుపరి ప్యాక్ రూ.219 ప్లాన్ ఇది అపరిమిత వాయిస్ కాల్‌లతో రోజుకు 1GB డేటా, 21 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 100 SMSలను అందిస్తుంది.
VI అందించే మూడో 1GB రోజువారీ డేటా ప్లాన్ రూ.239కి వస్తుంది 24 రోజుల వ్యాలిడిటీ రోజుకు 1GB అందిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలని అందిస్తుంది. మరొకటి రూ.269 ప్లాన్ ఇందులో రోజుకి 1GB డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 100 SMSలు అందిస్తుంది. రూ.199, రూ.219, రూ.269 ప్లాన్‌లలో VI సినిమాలు, టీవీకి యాక్సెస్‌ను పొందుతుంది.