Socks: రాత్రిపూట సాక్స్‌ ధరించి పడుకుంటున్నారా.. చాలా ప్రమాదం ఎందుకంటే..?

Socks: చలికాలంలో శరీరం వెచ్చగా ఉంచడానికి జనాలు అన్ని విధాల ప్రయత్నిస్తారు. వేడి వేడి ఆహారం తినడం, ఉన్ని దుస్తులు ధరించడం చేస్తారు. ఇది

Socks: రాత్రిపూట సాక్స్‌ ధరించి పడుకుంటున్నారా.. చాలా ప్రమాదం ఎందుకంటే..?
Sleeping In Socks
Follow us
uppula Raju

|

Updated on: Feb 06, 2022 | 8:13 PM

Socks: చలికాలంలో శరీరం వెచ్చగా ఉంచడానికి జనాలు అన్ని విధాల ప్రయత్నిస్తారు. వేడి వేడి ఆహారం తినడం, ఉన్ని దుస్తులు ధరించడం చేస్తారు. ఇది వాటిని లోపల నుంచి వెచ్చగా ఉంచుతుంది. చాలా మంది చలికాలంలో పడుకునేటప్పుడు సాక్స్ ధరించి నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇది నిద్రిస్తున్నప్పుడు వేడిగా అనిపించవచ్చు కానీ దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. నివేదికల ప్రకారం ఇది రక్త ప్రసరణపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎక్కువసేపు సాక్స్ ధరించడం వల్ల నరాలపై ఒత్తిడి కలుగుతుంది. ఇది జరిగినప్పుడు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. రాత్రి సాక్స్ ధరించడం వల్ల కలిగే నష్టాలను గురించి తెలుసుకుందాం.

1. రక్త ప్రసరణ

రాత్రి పడుకునేటప్పుడు బిగుతుగా ఉన్న సాక్స్ వేసుకుంటే అరికాళ్లు, పాదాల మధ్య రక్తప్రసరణపై చెడు ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో జలదరింపు లేదా ఒత్తిడిని అనుభవిస్తారు. నివేదికల ప్రకారం ఇది పాదాలలో దృఢత్వాన్ని తగ్గిస్తుంది.

2. శరీరం వేడెక్కడం

నిద్రపోయేటప్పుడు సాక్స్ ధరించడం వల్ల వెచ్చదనం ఉంటుందని ప్రజలు అనుకుంటారు కానీ కొన్నిసార్లు ఈ వేడి కూడా హానికరం. ఇది శరీర ఉష్ణోగ్రతను ఎక్కువగా పెంచుతుంది.

3. పరిశుభ్రత

సాక్స్‌లో పేరుకుపోయిన దుమ్ము, ధూళి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి దీని కారణంగా చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు ఎదురవుతాయి.

4. గుండెకి ఎఫెక్ట్‌

బిగుతుగా సాక్స్ వేసుకుని పడుకుంటే పాదాల్లో వేడి ఉంటుందని అనుకుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అలా చేయడం వల్ల గుండె ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. బిగుతుగా ఉండే సాక్స్ ధరించడం వల్ల సిరలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల రక్త సరఫరా సరిగ్గా ఉండదు. గుండె పంపింగ్‌లో మరింత కృషి చేయాల్సి ఉంటుంది. అందుకే బిగుతుగా లేదా వదులుగా ఉండే సాక్స్‌లు ధరిస్తే సరిపోతుంది.

Paratha Offer: 32 అంగుళాల పరోటా.. తింటే లక్ష రూపాయల బహుమతి..?

Viral Photos: ప్రపంచంలో ఈ 5 రకాల చేపలు ప్రాణాంతకం.. క్షణాల్లో మనిషి ప్రాణాలు తీస్తాయి..?

Viral Video: బుసలు కొట్టే పాముని చేయితో పట్టుకున్న యువతి.. వీడియో చూస్తే షాక్..?