Viral Video: కాబోయే భార్యతో భర్త ప్రవర్తన దారుణం..! ఇదేందయ్యా అంటున్న నెటిజన్లు.. (వీడియో)

Viral Video: కాబోయే భార్యతో భర్త ప్రవర్తన దారుణం..! ఇదేందయ్యా అంటున్న నెటిజన్లు.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Feb 07, 2022 | 9:14 AM

సోషల్ మీడియా ప్రపంచం చాలా భిన్నమైనది. ఇక్కడ ఎప్పుడు ఎలాంటి వీడియో వైరల్ అవుతుందో చెప్పలేం. సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన పలు వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు వధువు ఫన్నీ ఎంట్రీకి సంబంధించిన వీడియో...



సోషల్ మీడియా ప్రపంచం చాలా భిన్నమైనది. ఇక్కడ ఎప్పుడు ఎలాంటి వీడియో వైరల్ అవుతుందో చెప్పలేం. సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన పలు వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు వధువు ఫన్నీ ఎంట్రీకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారుతుంది. కొన్నిసార్లు వరుడి వింత చేష్టలు.. ఇలా ఎన్నో వీడియోలు నెట్టింట్లో వచ్చి చేరుతూనే ఉన్నాయి. అలాంటి ఓ వివాహ వేడుకకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. ఇందులో వరుడి చర్యలను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. వరుడు, వధువుతో ఏం చేశాడో చూస్తే మీ నవ్వును ఆపుకోలేరు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో కేవలం కొన్ని సెకన్లే ఉంది. వరుడు తన వధువు కోసం వేదికపై కూర్చుంటాడు. అప్పుడే వధువు ఎంట్రీ ఇస్తుంది. పెళ్లికూతురు మెల్లగా వేదిక వైపు నడుస్తోంది. వధువును చూసి వరుడు కూడా లేచి మెట్ల దగ్గరికి వస్తాడు. వధువు చేతిని పట్టుకుని, వరుడు ఆమెను వేదికపైకి పిలవడం ప్రారంభిస్తాడు. ఇంతలో వరుడు ఆమె చేయి పట్టుకుని గట్టిగా వైదిక పైకి లాగుతాడు. దీంతో అక్కడే నిలబడి ఉన్న వారంతా షాక్ అవుతూ కనిపించడం వీడియోలో చూడొచ్చు. వధువు దగ్గర నిలబడి ఉన్న ఆమె తల్లి కూడా వరుడి ఈ పనిని చూసి ఆశ్చర్యపోయింది. తర్వాత అందరూ నవ్వడం మొదలుపెట్టడం ఈ వీడియోలో చూడొచ్చు.

Published on: Feb 07, 2022 09:13 AM