Viral Video: ఏందిరయ్యా ఇదీ..! ప్రపంచంలో ఇలాంటి స్నానం ఎవ్వరూ చేసుండరు.. వైరల్ వీడియో

Man Made Shower Viral Video: వైరల్ అయ్యే వీడియోల్లో చాలా మంది తమ పనిని సులభతరం చేయడానికి కొన్ని గారడీలను చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియా (Social Media) లో నిత్యం చాలానే కనిపిస్తుంటాయి.

Viral Video: ఏందిరయ్యా ఇదీ..! ప్రపంచంలో ఇలాంటి స్నానం ఎవ్వరూ చేసుండరు.. వైరల్ వీడియో
Viral Video
Follow us
Shaik Madar Saheb

| Edited By: Anil kumar poka

Updated on: Feb 07, 2022 | 9:12 AM

Man Made Shower Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో అనునిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇంకొన్ని ఆలోచించేలా చేస్తుంటాయి. అయితే వైరల్ అయ్యే వీడియోల్లో చాలా మంది గారడీ చేస్తూ కనిపిస్తుంటారు. ప్రజలు తమ పనిని సులభతరం చేయడానికి కొన్ని గారడీలను చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియా (Social Media) లో చాలానే కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి జుగాడ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో (Viral Video) హల్‌చల్ చేస్తోంది. వీడియోలో యువకుడు చేస్తున్న స్నానం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఎలాంటి ఫెసిలిటీ లేకపోయినా.. షవర్ ఉపయోగించి స్నానం (crazy bath) చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే.. ఇతను ఈ కంట్రీ షవర్‌ని ఎలా సిద్ధం చేశాడో ఇప్పుడు చూద్దాం..

ఒక యువకుడు స్నానం చేస్తున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. తలకు షాంపూ పెట్టి శుభ్రం చేసుకుంటూ కనిపిస్తాడు. కొంత సేపటి తర్వాత గారడీ చేస్తాడు. అదేంటంటే.. అతను స్నానం చేసే చోట ఓ కర్రకు కవర్ వేలాడుతూ కనిపిస్తుంది. దానిలో నీళ్లు పోసి ఉంచుతాడు. తల రుద్దుకున్న అనంతరం.. పుల్ల చీపురుతో కవర్‌కు రంధ్రాలు పెడతాడు. ఆ తర్వాత షవర్‌లా నీళ్లు వస్తుంటుంటే.. హాయిగా తలస్నానం చేస్తాడు. ఇది చూస్తుంటే.. స్వయంగా తయారు చేసిన షవర్‌లా కనిపిస్తుంది. ఈ యువకుడు చేసిన జుగాడ్ అందరినీ తెగ ఆకట్టుకుంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూడండి..

వైరల్ వీడియో

వైరల్ వీడియో.. ఈ వీడియోను పరిక్ జైన్ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ట్విటర్‌లో పంచుకుంటూ ‘మంచి జుగాద్’ అని క్యాప్షన్‌లో రాశారు. దీన్ని చూసి సోషల్ మీడియా యూజర్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు ఈ యువకుడి ఆలోచనను మెచ్చుకుంటుండగా.. మరికొందరు నీటిని ఆదా చేస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Watch Video: మైదానంలో కెమిస్ట్రీతో కేక పుట్టించిన కోహ్లీ-రోహిత్.. వివాదాలకు స్వస్తి పలకాలంటోన్న ఫ్యాన్స్..!

Viral News: లక్ అంట్ ఇతనిదే.. చికెట్ కోసం కొట్టుకు వెళ్లి.. 75 లక్షలతో తిరిగొచ్చాడు.. ఈ గ్యాప్‌లో ఏం జరిగిందంటే..