playing with python: ఆడుకుంటున్న చిన్నారి.. ఇంతలో 10 అడుగుల భారీ పైథాన్.. వైరల్ అవుతున్న వీడియో..
సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ లకు కొదవే ఉండదు. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. పాములకు సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ ఉంది. మామూలుగానే పాములు చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన్పటినుంచి రక రకాల వైరల్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు బాగా ఇష్టపడతారు. అయితే వీటిలో కొన్ని వీడియోలు చూస్తే చాలా భయమేస్తుంది. తర్వాత ఏం జరగబోతుందో అనే ఉత్కంఠను రేపుతాయి. అలాంటి వీడియో ఒకటి తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. . ఇందులో ఓ చిన్నారి పైథాన్‌తో ఇంచక్కా ఆడుకుంటోంది. ఆ వీడియోను చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో ఓ భారీ కొండచిలువ బయట చిన్న అరుగుపైన కూర్చుని ఉన్న పాప వద్దకు పాక్కుంటూ వస్తుంది. అంతటి భారీ పాముని చూసి కూడా ఆ చిన్నారి భయపడకుండా దానితో అల్లరి చేస్తూ.. ఆటలు ఆడుతుంది.
Published on: Feb 07, 2022 09:10 AM
వైరల్ వీడియోలు
Latest Videos