Gadwal Bidda: సోషల్ మీడియా సంచలనం.. గద్వాల్ రెడ్డి బిడ్డ మృతి.. అనారోగ్యంతో..

Gadwal Reddy Bidda: సోషల్‌ మీడియా ప్రపంచంలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే.. చాలామంది టాలెంట్‌తోనే.. లేక వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రపంచానికి పరిచయమవుతుంటారు.

Gadwal Bidda: సోషల్ మీడియా సంచలనం.. గద్వాల్ రెడ్డి బిడ్డ మృతి.. అనారోగ్యంతో..
Gadwal Bidda
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 07, 2022 | 4:22 AM

Gadwal Reddy Bidda: సోషల్‌ మీడియా ప్రపంచంలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే.. చాలామంది టాలెంట్‌తోనే.. లేక వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రపంచానికి పరిచయమవుతుంటారు. అలా సోషల్ మీడియా (Social Media) సంచలనంగా మారిన వారిలో ‘గద్వాల రెడ్డి బిడ్డ’ (Gadwal Bidda) గా పేరు పొందిన మల్లికార్జున్ ఒకడు. గద్వాల రెడ్డిబిడ్డ అలియాస్ ఎస్ మల్లికార్జున్ రెడ్డి ఆదివారం మృతిచెందాడు. అతను అనారోగ్యంతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అతని స్వగ్రామం జోగులాంబా గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నె. అతని (Mallikarjun Reddy) అంత్యక్రియలు సోమవారం జిల్లేడుదిన్నెలో జరుగుతాయని కటుంబసభ్యులు తెలిపారు.

చిన్నతనం నుంచి ఆస్తమాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మల్లికార్జున్ రెడ్డి సోషల్‌ మీడియాలో చేసే వీడియోలు నిత్యం వైరల్‌ అవుతూనే ఉంటాయి. అప్పట్లో దళితులను కించపరుస్తూ మాట్లాడిన వీడియో వైరల్ అయింది. దీనిపై దళిత సంఘాలు సీరియస్ కావడంతో మల్లికార్జునరెడ్డి క్షమాపణ కోరాడు. ఇటీవల రామ్‌గోపాల్‌ వర్మపై కూడా ఓ వీడియో చేయగా.. వైరల్ అయింది. మల్లికార్జున్ రెడ్డిపై నెటిజన్లు మేమ్స్ కూడా వైరల్ చేస్తుంటారు.

ఇలా తన మాటలు, వీడియోలతో ఎన్నో లక్షల మంది నెటిజన్లను అలరించిన బాలుడు చనిపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు, నెటిజన్లు విషాదంలో మునిగిపోయారు. సోషల్‌మీడియా వేదికగా మల్లికార్జున్ రెడ్డికి సంతాపం తెలుపుతున్నారు.

Also Read:

AP Crime News: అనంతపురంలో ఘోరం.. నడిరోడ్డుపై దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే..

Anantapur Accident: పెళ్లింట చావు మేళం.. ఇంటికి వస్తుండగా కబళించిన మృత్యువు.. 9 మంది మృతి