Hyderabad: వీళ్లు మహాముదుర్లు.. రాత్రిపూట బైక్ కనిపిస్తే చాలు పెట్రోల్ మాయం.. వీడియో చూస్తే షాకే
Petrol thefting in Hyderabad: ఎక్కడైనా.. నగదు, నగలు, సెల్‌ఫోన్ల చోరీ గురించి వింటుంటాం.. ఇంకా ఏటీఎంలు, బ్యాంకుల లూటీ లాంటి ఘటనలను కూడా మనం చూస్తుంటాం..
Petrol thefting in Hyderabad: ఎక్కడైనా.. నగదు, నగలు, సెల్‌ఫోన్ల చోరీ గురించి వింటుంటాం.. ఇంకా ఏటీఎంలు, బ్యాంకుల లూటీ లాంటి ఘటనలను కూడా మనం చూస్తుంటాం.. అయితే.. ఇవన్నీ కొంత కష్టంతో కూడుకున్న పని అనుకున్నారో ఏమో కానీ.. దొంగలు రూట్ మార్చారు.. అదేంటోననుకుంటున్నారా..? ఇది వింటే కొంచెం ఆశ్చర్యపోక తప్పదు. అదే పెట్రోల్ చోరీలు.. ఇళ్ల ముందు పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను టార్గెట్ చేసి వాటిలోని పెట్రోల్ (Petrol thefting) ను అపహరిస్తున్నారు దుండగులు. ఇటీవల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండుతుండటంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. పెట్రోల్ ధరలు ఏకంగా వంద మార్క్ దాటాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో పెట్రోల్ దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా.. పెట్రోల్ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ (uppal police station) పరిధిలో చోటుచేసుకుంది.
ఉప్పల్ ప్రాంతంలో పెట్రోల్ దొంగతనాలు ఎక్కువయ్యాయని వాహనదారులు పేర్కొంటున్నారు. రాత్రి వేళ దొంగలు ఇళ్ల ముందు ఉంచిన ద్విచక్రవాహనాల్లోని పెట్రోల్‌ను అపహరిస్తున్నారు. పలు కాలనీల్లో ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాల్లో పెట్రోల్ దొంగతనం చేస్తున్నట్లు వాహనదారులు పేర్కొంటున్నారు. ఇటీవల వాహనాల నుంచి పెట్రోల్ డీజిల్ దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో పలువురు పెట్రోలింగ్‌ను పెంచాలని పోలీసులను కోరుతున్నారు. పోలీస్ గస్తీ సరిగా లేకపోవడం వలన చిల్లర దొంగలు రెచ్చిపోతున్నారని పలు కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.
పెట్రోల్ దొంగతనం వీడియో..
Also Read: