Chit Fund Fraud: కిలాడి దంపతులు.. చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.2.5 కోట్లతో రాత్రికి రాత్రే..
Couple Chit Fund Fraud in Dundigal: సడెన్‌గా ఆ ఇంటిముందు జనం గుమిగూడారు. ఏమైందోనని కంగారు పడ్డారంతా.. ఎవరైనా చనిపోయారో ఏమోనని ఆరాతీశారు. కానీ అసలు విషయం తెలిసి వారంతా అవాక్కయ్యారు.
Couple Chit Fund Fraud in Dundigal: సడెన్‌గా ఆ ఇంటిముందు జనం గుమిగూడారు. ఏమైందోనని కంగారు పడ్డారంతా.. ఎవరైనా చనిపోయారో ఏమోనని ఆరాతీశారు. కానీ అసలు విషయం తెలిసి వారంతా అవాక్కయ్యారు. అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.. వారంతా చిన్నాచితక పనులు చేస్తూ జివనం సాగించే సామాన్యులు. పైసాపైసా కూడబెట్టే వారిపై ఫ్రాడ్ కపుల్ కన్ను పడింది. ఇంకేముంది, పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు ఆ దంపతులు. మాయ మాటలు చెప్పి, పేద ప్రజలతో చీటీలు కట్టించారు. కోట్లలో ధనం చేతికొచ్చింది. దీంతో వారి దుర్భుద్దిని బయటపెట్టారు ఆ కంత్రీ కపుల్. దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో (Chit Fund Fraud) ఉడాయించారు. దీంతో లబోదిబోమంటున్నారు బాధితులు. మేడ్చల్ జిల్లా దుండిగల్ (Dundigal) ఏరియా సూరారంలో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. రూపాయి రూపాయి కూడబెట్టి చిట్టీలు వేసిన వారిని నమ్మించి 2.5 కోట్ల రూపాయలతో ఉడాయించారు దంపతులు.
సురారం కాలనీ రాజీవ్ గృహకల్ప 11వ బ్లాక్ ఎదురుగా కిరణా దుకాణం నిర్వహిస్తున్నారు మద్దిరాల పద్మ, విజయ్‌కుమార్ దంపతులు. ఇరవై ఏళ్లుగా అక్కడే నివాసముంటున్నారు. 15 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు ఆ దంపతులు. వారిని నమ్మి చిట్టీలు వేస్తున్నారు స్థానికులు. తాజాగా భారీ మొత్తంలో నగదు కూడబెట్టుకుని రాత్రికి రాత్రే చెక్కేశారు. అనుమానం వచ్చిన స్థానికులు, పద్మ ఇంటికి రాగా అసలు విషయం తెలిసి బాధితులు గుండెలు బాదుకుంటున్నారు.
మోసపోయామని గుర్తించిన బాధితులు దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులంతా పద్మ ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. 120 మంది వద్ద 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసి, నగదుతో ఉడాయించారని ఆరోపిస్తున్నారు బాధితులు. ఇటీవలే ఆ పందతులు నివసించే ఇల్లును కూడా అమ్మేసినట్టు చెబుతున్నారు స్థానికులు.
Also Read: