AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WOMAN MURDER: మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని.. భార్యను గొడ్డలితో నరికి చంపాడు

చివరి వరకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త.. తన భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని గొడ్డలితో నరికి చంపాడు. తెలంగాణలోని నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలోని...

WOMAN MURDER: మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని.. భార్యను గొడ్డలితో నరికి చంపాడు
Wife Muder
Ganesh Mudavath
|

Updated on: Feb 07, 2022 | 7:36 AM

Share

చివరి వరకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త.. తన భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని గొడ్డలితో నరికి చంపాడు. తెలంగాణలోని నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలోని బొక్కమంతల పహాడ్‌ గ్రామానికి చెందిన ధర్మారపు రుద్రయ్యకు నల్గొండ పానగల్‌కు చెందిన రాజేశ్వరితో పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు గణేశ్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి రుద్రయ్య మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆరు నెలల కిత్రం భార్యను, చిన్న కుమారుడిని తీసుకొని హైదరాబాద్‌లో నాగోల్‌లోని ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు.

ఆదివారం రుద్రయ్య అన్న కుమార్తె పట్టు వస్త్రాలంకరణ వేడుక ఉండటంతో భార్య, కుమారుడితో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. మధ్యాహ్న సమయంలో రాజేశ్వరిని మద్యానికి డబ్బులు ఇవ్వాలని అడగగా ఆమె ఇవ్వలేదు. దీంతో కోపోద్రిక్తుడైన రుద్రయ్య అక్కడే ఉన్న గొడ్డలితో భార్య తలపై నరికి పరారయ్యాడు. గమనించిన స్థానికులు బాధితురాలిని మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేశ్వరి మృతి చెందింది. మృతురాలు బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇవీచదవండి.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఏ పని చేపట్టినా సక్సెస్.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Road Accident: పెళ్లికి హాజరై వస్తుండగా.. పేలిన కారు టైర్లు.. ఇద్దరు దుర్మరణం

Tanguturu Insident: తల్లీకూతుళ్ల హత్య కేసులో విస్తుగొలిపే వాస్తవాలు.. అసలు ఏం జరిగిందంటే..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!