AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tanguturu Insident: తల్లీకూతుళ్ల హత్య కేసులో విస్తుగొలిపే వాస్తవాలు.. అసలు ఏం జరిగిందంటే..

ప్రకాశం జిల్లా టంగుటూరులో నలుగురిని కత్తులతో పొడిచి గొంతులు కోసి హత్యలు చేసిన ఇద్దరు నరరూప రాక్షసులను పోలీసులు అరెస్ట్‌ చేశారు...

Tanguturu Insident: తల్లీకూతుళ్ల హత్య కేసులో విస్తుగొలిపే వాస్తవాలు.. అసలు ఏం జరిగిందంటే..
Srinivas Chekkilla
|

Updated on: Feb 06, 2022 | 8:47 PM

Share

ప్రకాశం(Prakasham) జిల్లా టంగుటూరులో నలుగురిని కత్తులతో పొడిచి గొంతులు కోసి హత్యలు(Murder) చేసిన ఇద్దరు నరరూప రాక్షసులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి దగ్గర నుంచి 30 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల క్రితం జరిగిన తల్లీకూతుళ్ల జంట హత్య కేసు దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. నాలుగేళ్లక్రితం ఇదే తరహాలో చీమకుర్తి(chimakurthi)లో జరిగిన భార్యాభర్తల జంట హత్య కేసులో కూడా టంగుటూరు జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడు శివకోటయ్య నిందితుడుగా ఉన్నట్టు గుర్తించారు. అంతేకాకుండా టంగుటూరులోనే ఇటీవల బంగారం షాపులో దోపిడీ చేసి దాదపు కేజీ బంగారం దోచుకెళ్లిన కేసులో శివకోటయ్య నిందితుడిగా తేల్చారు.

ఇప్పటివరకు వీరు నేరాలకు, హత్యలకు పాల్పడిన 6 కేసుల్లో 30 లక్షల విలువైన బంగారం, వెండి నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శివకోటయ్యతో పాటు జరుగుమల్లికి చెందిన నరేష్‌ నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శివకోటయ్య గతంలో ఇద్దరు మహిళలను తీవ్రంగా గాయపర్చి ఒంటిపై నగలు ఎత్తుకెళ్లిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అలాగే పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్టు గుర్తించారు.

టంగుటూరులో అత్యంత కిరాతకంగా తల్లీకూతుళ్లు శ్రీదేవి, మేఘనలు హత్య గురి కావడంతో ఇతర రాష్ర్టాల దోపిడీ ముఠాల పనిగా భావించిన పోలీసులు రెండు నెలలు పాటు జల్లెడ పట్టారు. చివరికి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు జంట హత్యలకు ముందు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. హత్యలకు ముందు నాలుగురోజుల పాటు రెక్కీ నిర్వహించారు. అనంతరం ఇంట్లో బీరువాలో ఉన్న బంగారం కోసం వెళ్లి శ్రీదేవి ఆమె కుమార్తె మేఘనలు తిరగబడటంతో వారిని దారుణంగా ఇరవైకి పైగా కత్తిపోట్లు పోడిచారు. నిందితుల్లో నరేష్‌ అనే యువకుడు మహిళలపై పెప్పర్‌ చల్లుతుండగా ప్రధాన నిందితుడు శివకోటయ్య కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. అనంతరం గొంతుకోసి హత్య చేశారు.

వారి వద్ద ఉన్న బంగారం అపహరించుకెళ్లారు. వేలిముద్రలతో పాటు కాల్‌డేటా ఆధారంగా విచారణ జరిపిన పోలీసు అధికారులు సీసీ కెమెరాల్లో దొరికిన ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకొని విచారించడంతో వీరిద్దరి గుట్టు రట్టయింది. ఎస్పీ మలిక గార్గ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి స్వీయ పర్యవేక్షణ చేశారు. రెండు నెలల తర్వాత ఎట్టకేలకు సాంకేతిక ఆధఆరంగా మిస్టరీని ఛేదించారు.

శివ కోటయ్య పగలు ఆటో తోలుతూ రెక్కీలు నిర్వహించడం. ఆపై దోపిడీలు చేయడం అతని పని. జరుగుమల్లి మండలానికి చెందిన బేల్దారీ పనులు చేసే మరో యువకుడు నరేష్‌ను తనతో కలుపుకున్నాడు. టంగుటూరులో జంట హత్యల ఘటనకు రెండు నెలల ముందు మృతుల బంధువుకు చెందిన బంగారపు షాపులో దోపిడీ జరిగింది. వీరిద్దరే ఆ దోపిడీకి పాల్పడినట్టు తేలింది. అదేక్రమంలో చీమకుర్తిలో 2018లో జరిగిన వృద్ధ దంపతుల హత్యకేసులో కూడా శివకోటయ్యే నిందితుడిగా పోలీసుల విచారణలో తేలింది.

చీమకుర్తిలోని కసికోట్ల వారి వీధిలో భార్యాభర్తలు దింతకుర్తి సుబ్బారావు, రాజ్యలక్ష్మిలను శివకోటయ్య హత్య చేసి బంగారు నగలు ఎత్తుకెళ్ళినట్టు పోలీసులు తేల్చారు. సుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి జొరబడి బీభత్సం సృష్టించాడు. దంపతులపై ఒక్కసారిగా దాడి చేసి గొంతులు కోశాడు. ప్రధాన నిందితుడు శివకోటయ్య మొదటి భార్యది చీమకుర్తి. పైగా అతని అత్తగారిల్లు మృతుల ఇంటికి సమీపంలోనే ఉండటంతో ఒంటరిగా ఉంటున్న వృద్ధదంపతులను ఈజీగా హతమార్చి చోరీకి పాల్పడినట్టు తేలింది.

ఈకేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న శివకోటయ్య టంగుటూరులోనే ఇటీవల జరిగిన ఓ బంగారం షాపు దోపిడీ కేసులో కూడా నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు… ఈ దోపిడీలో 800 గ్రాముల బంగారు నగలను ఎత్తుకెళ్ళాడు… అలాగే ఇద్దరు ఒంటరి మహిళలపై దాడి చేసి నగలు ఎత్తుకెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు… ఈ కేసుల్లో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి వీరి దగ్గర నుంచి బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వీరు నేరాలకు, హత్యలకు పాల్పడిన 6 కేసుల్లో 30 లక్షల విలువైన బంగారం, వెండి నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Aslo.. Hyderabad News: అమ్మో.. ఈ దంపతులు మహా ముదుర్లు.. నమ్మించే నట్టేట ముంచారు.. ఏకంగా 2 కోట్లు..