Hyderabad News: అమ్మో.. ఈ దంపతులు మహా ముదుర్లు.. నమ్మించే నట్టేట ముంచారు.. ఏకంగా 2 కోట్లు..

Hyderabad Cheating: మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిట్టీల పేరుతో బారి మోసం వెలుగుచూసింది. రూపాయి రూపాయి కూడబెట్టి చిట్టీలు వేయగా..

Hyderabad News: అమ్మో.. ఈ దంపతులు మహా ముదుర్లు.. నమ్మించే నట్టేట ముంచారు.. ఏకంగా 2 కోట్లు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 06, 2022 | 5:44 PM

Hyderabad Cheating: మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిట్టీల పేరుతో బారి మోసం వెలుగుచూసింది. రూపాయి రూపాయి కూడబెట్టి చిట్టీలు వేయగా.. నమ్మించి రూ. 2.5కోట్లతో ఉడాయించారు కేటుగాళ్లు. ఈ ఘటన హైదరాబాద్ సురారం కాలనీలో జరిగింది. వివరాల్లోకెళితే.. హైదరాబాద్ సురారం కాలనీ రాజీవ్ గృహకల్ప 11వ బ్లాక్ ఎదురుగా కిరణా దుకాణం నిర్వహిస్తున్న దంపతులు మద్దిరాల పద్మ, విజయ్ కుమార్.. గత ఇరవై ఏళ్లుగా స్థానికంగా నివాసముంటున్నారు. 15 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారిని నమ్మి స్థానికులంతా వారి వద్ద ఏళ్లుగా చిట్టీలు వేస్తున్నారు. దాంతో భారి మొత్తం నగదు కూడబెట్టుకుని గత వారం క్రితం రాత్రికి రాత్రే ఇల్లు కాలి చేసి వెళ్లిపోయారు. తొలుత వారు ఊరికెళ్లారని భావించారు పొదుపు చేసిన వ్యక్తులు. ఆ తరువాత వారు పారిపోయారని గుర్తించిన బాధితులు.. దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదిలాఉంటే.. బాధితులంతా నేడు నిందితుడి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. 120 మంది వద్ద సుమారు రూ.2.5 కోట్ల నగదు సేకరించి.. రాత్రికి రాత్రే ఉడాయించారని ఆరోపించారు బాధితులు. నిందితులు నివాసం ఉన్న ఇల్లును సైతం విక్రయించినట్లు బాధితులు గుర్తించారు. కేవలం చిట్టి నగదే కాకుండా.. పలువురు వద్ద తన ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి బంగారం సైతం తీసుకెళ్లారు ఈ మాయ దంపతులు. కుటుంబసభ్యుల ఆపరేషన్లు, బిడ్డల పెళ్లిళ్ల కోసం నగదు కూడబెట్టుకుంటే ఇలా మోసం చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కంటతడి పెట్టుకున్నారు. కాగా, ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also read:

Mahesh Babu: రికార్డులు చెరిపేస్తోన్న మహేశ్ బాబు.. ఆ యాడ్ కోసం భారీగా రెమ్యునరేషన్

PPF vs NPS investment: ఉద్యోగ విరమణ నిధికోసం ఎందులో పెట్టుబడి పెడితే లాభం.. పీపీఎఫ్? ఎన్ పీఎస్?

Viral Video: గేదె, కుక్కల మధ్య లాంగ్‌జంప్‌ పోటీ.. ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా..?