Statue of Equality: సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న పవన్‌కల్యాణ్.. ఆయన మహాసంకల్పం వల్లే అంటూ..
Pawan Kalyan Statue of Equality: ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో జరుగుతున్న సహస్రాబ్ది సమారోహంలో పాల్గొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సమతామూర్తి విగ్రహంతోపాటు
Pawan Kalyan Statue of Equality: ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో జరుగుతున్న సహస్రాబ్ది సమారోహంలో పాల్గొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సమతామూర్తి విగ్రహంతోపాటు 108 దివ్య ఆలయాలనూ దర్శించుకున్నారు. చినజీయర్ స్వామి మహాసంకల్పం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు పవన్. చినజీయర్ స్వామికి పాదాభివందనలు చేశారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. సమతామూర్తి రామానుజల వారి 216 అడుగుల విగ్రహం వద్దకు రావడం సంతోషంగా ఉందని అననారు. ఇంత ఎత్తులో సమతామూర్తి విగ్రహం స్థాపించడం చినజీయర్ స్వామి మహాసంకల్పం వల్లే సాధ్యమైందన్నారు. 108 దివ్య ఆలయాలు ఒకే చోట ఉండటం గొప్ప విషయం అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ దివ్యక్షేత్రం భాగ్యనగరానికి సరికొత్త గుర్తుగా మారిందన్నారు. ఆధ్యాత్మికక్షేత్రం అందరినీ ఆకట్టుకుంటోందన్నారు. హైదరాబాద్ ఆధ్యాత్మిక రాజధాని గా మారనుందని పేర్కొన్నారు. వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన రామానుజ విగ్రహాన్ని నరేంద్ర మోదీ ఆవిష్కరణ చేయడం శుభపరిణామం అన్న ఆయన.. రాజకీయాలు పక్కన పెడితే ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే అర్హత ఆయనకే ఉందన్నారు.
Also read:
India-Pak Ties: భారత్-పాక్ మధ్య రహస్య మంతనాలు జరుగుతున్నాయా? మోదీ పాక్ పర్యటనకు వెళతారా?..
AP Corona Cases: తగ్గు ముఖం పట్టిన కరోనా ప్రభావం.. ఏపీలో భారీగా తగ్గిన పాజిటివ్‌ల సంఖ్య..