AP Corona Cases: తగ్గు ముఖం పట్టిన కరోనా ప్రభావం.. ఏపీలో భారీగా తగ్గిన పాజిటివ్‌ల సంఖ్య..

Andhra Pradesh Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రోజు రోజుకు నమోదవుతున్న కేసుల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.

AP Corona Cases: తగ్గు ముఖం పట్టిన కరోనా ప్రభావం.. ఏపీలో భారీగా తగ్గిన పాజిటివ్‌ల సంఖ్య..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 06, 2022 | 5:47 PM

Andhra Pradesh Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రోజు రోజుకు నమోదవుతున్న కేసుల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. మొన్నటికి నిన్నటికి 800 కేసులు తక్కువ నమోదవగా.. నిన్న నమోదైన కేసులకు, ఇవాళ నమోదైన కేసులకు కూడా అంతే తేడా కనిపించింది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 28,598 శాంపిల్స్ ని పరీక్షించగా 2,690 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు వైద్యులు. ఇక నిన్నటి రోజున 3,396 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే.. నిన్నటికి ఇవాళ్టికి 706 కేసులు తగ్గాయి. కాగా, తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 23,03,455 మంది కరోనా బారిన పడ్డారు. ఒక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది కరోనాకు బలయ్యారు. దాంతో రాష్ట్రంలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య.. 14,664 లకు చేరింది. కోవిడ్ వల్ల ప్రకాశంలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇక గడిచిన 24 గంటల్లో 11,855 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 22,19,219 లకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 69,572 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ కరోనా తాజా వివరాలను ప్రకటించింది.

జిల్లాల వారీగా కరోనా కేసులు.. ఇదిలాఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నమోదైన పాజిటివ్ కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 518 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత గుంటూరు జిల్లాలో 354 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం – 140, చిత్తూరు – 131, వైఎస్ఆర్ కడప – 181, కృష్ణా – 352, కర్నూలు – 147, నెల్లూరు – 123, ప్రకాశం – 156, శ్రీకాకుళం – 36, విశాఖపట్నం – 198, విజయనగరం – 56, పశ్చిమ గోదావరి – 298 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

కరోనా సమాచారం మీ చేతుల్లోనే: ● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి. ● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు ● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు ●వెబ్ సైట్ ద్వారా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు. ● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. ఈ లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.

Also read:

IND VS WI: చాహల్-సుందర్ దెబ్బకు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్ విలవిల.. 176 పరుగులకే ఆలౌట్..!

Post Office Scheme: నెలనెలా ఆదాయం వచ్చే పోస్టాఫీస్ పథకం.. ఖాతా ఎలా తెరవాలంటే..

Lata Mangeshkar: ఓపీ నయ్యర్‌ లతా మంగేష్కర్‌తో ఎందుకు పాడించలేదో తెలుసా?