AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS WI: చాహల్-సుందర్ దెబ్బకు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్ విలవిల.. 176 పరుగులకే ఆలౌట్..!

భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతోన్న తొలి వన్డేలో యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ తలో 3 వికెట్లు తీయడంతో వెస్టిండీస్ తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరింది.

IND VS WI: చాహల్-సుందర్ దెబ్బకు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్ విలవిల.. 176 పరుగులకే ఆలౌట్..!
Ind Vs Wi 1st Odi
Venkata Chari
|

Updated on: Feb 06, 2022 | 5:34 PM

Share

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న వన్డే సిరీస్ (India vs West Indies, 1st ODI) తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టుపై భారత బౌలర్లు విధ్వంసం సృష్టించారు. వెస్టిండీస్ జట్టు కేవలం 176 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చాహల్‌లు వెస్టిండీస్‌కు ఎక్కువ నష్టం కలిగించారు. యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) 4 వికెట్లు తీశాడు . వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీశాడు. 57 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన జాసన్ హోల్డర్ వెస్టిండీస్ తరపున అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఫాబియన్ అలెన్ కూడా 29 పరుగులు చేశాడు. వీరిద్దరి మధ్య అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొనడంతో వెస్టిండీస్ జట్టు 176 పరుగులకు చేరుకోగలిగింది.

రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ఫీల్డింగ్, బౌలింగ్ అద్భుతంగా ఉంది. డీఆర్‌ఎస్ తీసుకున్న మూడు నిర్ణయాలూ భారత్‌కు అనుకూలంగానే వెళ్లాయి. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ నిర్ణయం తప్పు కాదని నిరూపించాడు. వెస్టిండీస్‌ టాప్‌ ఆర్డర్‌ బాగానే ఆరంభించినా.. భారత బౌలింగ్ ధాటిగా విండీస్ బ్యాట్స్‌మెన్స్ ఎవరూ భారీ స్కోరును చేయలేకపోయారు. మిడిల్ ఓవర్లలో కూడా భారత బౌలర్లు ఎలాంటి సడలింపులు ఇవ్వకపోవడంతో టీమ్ ఇండియాకు లాభం చేకూరింది.

అత్యుత్తమ బౌలింగ్‌తో ఆకట్టుకున్న భారత్ .. వెస్టిండీస్ వికెట్ కీపర్ షాయ్ హోప్ బలమైన ఆరంభాన్ని అందించాడు. రెండు ఫోర్లు కొట్టడం ద్వారా తన ఫామ్‌లో ఉన్నట్లు సంకేతాలను చూపించాడు. అయితే మరో వైపు సిరాజ్ తన బౌలింగ్‌లో షే హోప్‌ను బౌల్డ్ చేసి వెస్టిండీస్‌కు తొలి దెబ్బ రుచిచూపించాడు. దీని తర్వాత, బ్రాండన్ కింగ్, డారెన్ బ్రావో గేమ్‌ను 11వ ఓవర్‌కు తీసుకెళ్లారు. అయితే వాషింగ్టన్ సుందర్ రాకతో అంతా మారిపోయింది. 12వ ఓవర్లో సుందర్ మొదట బ్రాండన్ కింగ్‌ను అవుట్ చేసి, ఆ తర్వాత డారెన్ బ్రావోను ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. దీని తర్వాత, రోహిత్ శర్మ.. యుజ్వేంద్ర చాహల్‌ను రంగంలోకి దింపాడు. 20వ ఓవర్‌లో నికోలస్ పూరన్, కెప్టెన్ కీరన్ పొలార్డ్‌లను వరుసగా రెండు బంతుల్లో అవుట్ చేయడం ద్వారా వెస్టిండీస్ వెన్ను విరిచాడు. వెస్టిండీస్ 20వ ఓవర్లోనే 5 వికెట్లు కోల్పోయింది. 22వ ఓవర్లో చాహల్ షెమ్రాన్ బ్రూక్స్ కూడా ఔట్ చేశాడు. మరుసటి ఓవర్‌లో, ప్రసిద్ధ కృష్ణ తన బౌలింగ్‌లో అకీల్ హుస్సేన్‌ను పెవిలియన్ చేర్చాడు.

జాసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్ వెస్టిండీస్ జట్టును కష్టాల నుంచి రక్షించారు. వీరిద్దరూ కలిసి 8వ వికెట్‌కు 91 బంతుల్లో 78 పరుగులు జోడించారు. జాసన్ హోల్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 58 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని 38వ ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్ విడదీశాడు. ఆతర్వాత 41వ ఓవర్‌లో ప్రసీద్ధ్ క్రిష్ణ హోల్డర్‌ను ఔట్ చేసి విండీస్‌కు మరో దెబ్బ తీశాడు. చివర్లో చాహల్ అల్జారీ జోసెఫ్‌ను అవుట్ చేయడంతో విండీస్ టీం కేవలం 43.5 ఓవర్లలో 176 పరుగులకు కుప్పకూలింది.

Also Read: Suresh Raina Father: సురేశ్‌ రైనా తండ్రి మృతి.. క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసిన త్రిలోక్‌చంద్‌..

IND vs WI: లతా మంగేష్కర్ మృతికి సంతాపం తెలిపిన టీమ్‌ ఇండియా..1000వ వన్డేలో నల్ల బ్యాండ్ ధరించి మైదానంలోకి..