Indian Cricket Team: ఈ ప్రయాణం ఎంతో అద్భుతం.. తొలి వన్డేకి, 1000వ వన్డేకి చాలా మార్పులొచ్చాయి: భారత మాజీ క్రికెటర్
నేను 1000 వన్డేల గురించి ఆలోచించినప్పుడు, నేను మా ప్రయాణం గురించి ఆలోచిస్తాను. ఎన్నో ఎత్తుపల్లాలు. కానీ ఇది చాలా బాగుంది. చాలా మరపురాని క్షణాలు. వన్డేల్లో భారత్ తరఫున ఆడిన క్రికెటర్ ఎవరని అడిగితే అదే చెబుతారు.
Indian Cricket Team: కాలం గడిచిపోతూనే ఉంటుంది. 1974 లో లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో భారత్(Team India) తన మొదటి వన్డే ఆడినప్పటి నుంచి నేటి వరకు ఎంతో దూరం ప్రయాణించింది. ఆ మ్యాచ్‌లోని విషయాలను గుర్తుంచుకోవడం నిజంగా చాలా కష్టం. నేడు అహ్మదాబాద్‌లో టీమిండియా(India vs West Indies) 1000వ వన్డే ఆడుతోంది. ఈ సందర్భంగా టీమిండియా తరపున 1వ వన్డే జట్టులో సభ్యుడు, 1983లో ప్రపంచ కప్ విజేతలో సభ్యుడిగా ఉన్న మదన్ లాల్(Madan Lal).. తన అనుభవాలను పంచుకున్నాడు.
‘మేం ఇప్పుడే వన్డే క్రికెట్ ఆడడం ప్రారంభించాం. ఎలాంటి అనుభవం లేదు. వన్డే క్రికెట్ ప్రారంభంలో మేం కష్టపడడానికి ఇదో ఓ కారణం. అయితే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌లో ఎక్కువ మ్యాచ్‌లలో గ్రైండింగ్ చేయడం ద్వారా మేం కఠినమైన మార్గాన్ని నేర్చుకున్నాం. నేర్చుకుంటూనే ఉన్నాం’ అని మదన్‌లాల్ చెప్పుకొచ్చారు.
‘ఇంతకుముందు, వన్-డేలు 60 ఓవర్లు సాగేవి. మా విధానం ఇప్పుడు మనం చూస్తున్న దానికి చాలా భిన్నంగా ఉంది. చేతిలో వికెట్లు ఉంటే డెత్ ఓవర్ల సమయంలో రన్-రేట్ అంశాన్ని సరిదిద్దుకోవచ్చని ఆలోచన. అది అప్పటి మనస్తత్వం. బంతితో, పరుగుల ప్రవాహాన్ని ఆపడానికి మాకు ఒకే ఒక మార్గం తెలుసు.. అదే వికెట్లు తీయడం. ప్రస్తుతం బౌలర్లు వికెట్లు పడకపోయినా, పరుగుల స్కోరింగ్‌ను ఆపడానికి భిన్నంగా ప్లాన్ చేస్తున్నారు. నేటి క్రికెట్‌లో బౌలింగ్‌లో ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి’ అని అన్నారు.
‘మేం ఇంకా ఫార్మాట్ నేర్చుకుంటున్నాం. మేం అనుభవం సంపాదించినప్పుడు, ఓవర్‌కు రెండు లేదా మూడు రన్ రేట్‌తో స్కోర్ చేయడం ద్వారా మనం మనుగడ సాగించలేమని, మేం ఓవర్‌కి ఐదు లేదా ఆరు పరుగులు చేరుకోవాలని తెలుసుకున్నాం. ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే, విజయావకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. బౌలింగ్ వారీగా మాకు అప్పట్లో ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి, మేం ఎప్పుడూ వికెట్ల వెంట పడాలని కోరుకుంటూనే ఉన్నాం’ అని ఆయన తెలిపారు.
1000 వన్డేలంటే మాములు విషయం కాదు.. ‘1000 వన్డేలు ఆడడం అంటే చాలా పెద్ద విషయం. అలా చేసిన మొదటి దేశం మనదే. మరి మేం ఇన్ని మ్యాచ్‌లు ఎలా ఆడాం. ఎందుకంటే మా ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి’ అని పేర్కొన్నాడు.
(ODI క్రికెట్‌లో భారత్: మ్యాచ్‌లు – 999 | గెలిచింది – 518 | ఓడిపోయింది – 431.. నేటి మ్యాచ్‌ను ఇందులో కలపలేదు.)
‘మేం 1983లో ప్రపంచ కప్ గెలిచాం. బెన్సన్ అండ్ హెడ్జెస్ కప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచ కప్, 2011 ప్రపంచకప్ గెలిచాం. భారత్ గెలవని ఒక్క ట్రోఫీ అయినా ఉందేమో చెప్పండి. మంచి ఫలితాలను పొందుతున్నంత కాలం మరింతగా పెరుగుతూనే ఉంటారు. నిలకడ ఈ ఫార్మాట్‌ను భారత క్రికెట్‌కు అపారంగా మార్చింది. వాణిజ్య దృక్కోణంలోనూ మార్చింది. అలాగే వన్డేలు కూడా బీసీసీఐకి చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి’ అని తెలిపారు. భారత్‌లో పర్యటించే జట్టు టెస్టులతో పాటు వన్డేలు కూడా ఆడేందుకు ఎదురుచూస్తుంటుంది. పరిమిత ఓవర్లు అంటే కేవలం వన్డేలు, టీ20ఐలతో చాలా సిరీస్‌లు ఉన్నాయి.
‘అప్పటికి ఇప్పటికి తేడా చాలా ఎక్కువ. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఎంతో మెరుగుదలతోపాటు సరికొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి. అలాగే సాంకేతికత వేరే స్థాయిలో ఉంది. రూల్స్‌లోనూ చాలా మార్పులు వచ్చాయి. ఫీల్డింగ్, ఫిట్‌నెస్ ప్రమాణాలు పూర్తిగా అభివృద్ధి చెందాయి. కాలక్రమేణా, భారతదేశం మెరుగుపడింది. ప్రపంచ వ్యాప్తంగా ఎదగడానికి ఇది చాలా ముఖ్యమైన కారణాలలో ఒకటి’ అని అన్నారు.
ఇప్పుడున్న ఎనర్జీ అప్పుడు లేదు.. ‘కానీ ఇప్పుడు వన్డేల్లో చూస్తున్నంత ఎనర్జీ అప్పట్లో లేదు. మేం 1983 ప్రపంచకప్ గెలిచిన తర్వాత మాత్రమే ఇది వచ్చింది. ఆ విజయం యావత్ దేశానికి శక్తిని, ప్రేరణను ఇచ్చింది. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి తదితర యువ తరాలకు చెందిన క్రికెటర్లు ప్రపంచకప్ గెలవాలని కోరుకున్నారు.
వన్డేలలో మార్పుల గురించి చెప్పాలంటే ముఖ్యంగా పవర్‌ప్లేల ఎంట్రీతో ఆట పూర్తిగా మారిపోయింది. వన్డే క్రికెట్ వేగం పుంజుకోవడానికి అది దోహదపడిందని భావిస్తున్నాను. ఫార్మాట్ ఎప్పటిలాగే అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. నేటి ప్రపంచంలో, మీరు మొదటి 10 ఓవర్లలో ఏడు లేదా ఎనిమిది పరుగుల వద్ద పరుగులు సాధించలేకపోతే కచ్చితంగా వెనుకంజలో పడిపోయినట్లే.
నేను భావిస్తున్న ఒక విషయం ఏమిటంటే, ఇప్పటి ప్లేయర్లు ఎవరికీ భయపడడంలేదు. ఇది అతి పెద్ద తేడాలలో ఒకటి. ఇంతకుముందు, చేతిలో ఎక్కువ ఓవర్లు ఉన్నాయని భావించిన బ్యాటర్లు స్లోగా బ్యాటింగ్ చేసేవారు. ఇప్పుడు ప్లేయర్లు నిర్భయంగా ఆడుతున్నారు. తక్కువ ODIల కారణంగా ఎక్కువ రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఎక్కువ గేమ్‌లతో టీంలన్నీ బిజీగా ఉన్నాయని అన్నారు.
రోహిత్, ద్రవిడ్ కలిసి సరికొత్త ఆరంభాన్ని అందించారు.. రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ కలిసి రావడం కొత్త ప్రారంభం. భవిష్యత్తులో ఏమి జరగబోతోందో అంచనా వేయడం ఎల్లప్పుడూ కష్టం. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ ఇద్దరూ చాలా సమర్థులే. ఇది వారు తమ బృందాన్ని ఎలా నిర్మిస్తారో, వారి ప్రణాళిక, విజన్ ఏమిటి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సరైన దృష్టిని కలిగి ఉండటం చాలా ముఖ్యమని ఆయన అన్నారు
టీమిండియా జట్టు వెస్టిండీస్‌తో ఆడబోయే మ్యాచ్‌లు, భవిష్యత్తులో, వారు ప్రపంచ కప్‌ను సమీపిస్తున్నందున వారు ఒక నిర్దిష్ట ప్రణాళికను కలిగి ఉండాలి. ఇద్దరూ సమర్థులు. వారు ఎలా చేస్తున్నారో ఫలితాలు మాత్రమే తెలియజేస్తాయి. ప్రతి ఒక్కరూ పనితీరు ఆధారంగా మాత్రమే అంచనా వేస్తారు.
నేను 1000 వన్డేల గురించి ఆలోచించినప్పుడు, నేను మా ప్రయాణం గురించి ఆలోచిస్తాను. ఎన్నో ఎత్తుపల్లాలు. కానీ ఇది చాలా బాగుంది. చాలా మరపురాని క్షణాలు. వన్డేల్లో భారత్ తరఫున ఆడిన క్రికెటర్ ఎవరని అడిగితే అదే చెబుతారు. ఇది ఒక మైలురాయి. ఈ ప్రయాణం అద్భుతమైనదంటూ ముగించారు.
India’s ODI captain in milestone matches – 100th- Kapil dev 200th- Azharuddin 300th- Sachin Tendulkar 400th- Azharuddin 500th- Sourav Ganguly 600th- Sehwag 700th-MS Dhoni 800th-MS Dhoni 900th-MS Dhoni 1000th- Rohit Sharma@BCCI pic.twitter.com/6XVmC4ihCV
— All About Cricket (@allaboutcric_) February 5, 2022
(మదన్ లాల్ భారతదేశ 1వ ODI జట్టులో సభ్యుడిగా ఉన్నారు. 1983లో ప్రపంచ కప్ విజేత జట్టులోనూ ఉన్నారు.)
Also Read: IND VS WI: చాహల్-సుందర్ దెబ్బకు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్ విలవిల.. 176 పరుగులకే ఆలౌట్..!