IND vs WI: లతా మంగేష్కర్ మృతికి సంతాపం తెలిపిన టీమ్‌ ఇండియా..1000వ వన్డేలో నల్ల బ్యాండ్ ధరించి మైదానంలోకి..

IND vs WI: భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. తొలి మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

IND vs WI: లతా మంగేష్కర్ మృతికి సంతాపం తెలిపిన టీమ్‌ ఇండియా..1000వ వన్డేలో నల్ల బ్యాండ్ ధరించి మైదానంలోకి..
Ind Vs Wi
Follow us

|

Updated on: Feb 06, 2022 | 3:22 PM

IND vs WI: భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. తొలి మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇది భారత్‌కు 1000వ వన్డే. ప్రపంచంలో ఇన్ని వన్డేలు ఆడిన తొలి జట్టు భారత్ మాత్రమే. అయితే ఈ చారిత్రాత్మక భారత వన్డేకు ముందే లతా మంగేష్కర్ మరణించారనే విషాద వార్త తెలిసింది. దీంతో భారత జట్టు ఆమె మృతికి సంతాపం తెలిపింది. ఆటగాళ్లు బ్లాక్ బ్యాండ్ ధరించి మైదానంలోకి వచ్చారు. లతా మంగేష్కర్ ఈ రోజు ముంబైలో 92 సంవత్సరాల వయస్సులో మరణించిన సంగతి తెలిసిందే. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. లతా మంగేష్కర్ గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లతా మంగేష్కర్ మృతి పట్ల టీమిండియాతో పాటు భారత మాజీ క్రికెటర్లు కూడా సంతాపం వ్యక్తం చేశారు.

సంతాపం వ్యక్తం చేసిన సునీల్ గవాస్కర్

భారత్-వెస్టిండీస్ మ్యాచ్‌లో వ్యాఖ్యానించిన మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ లతా మంగేష్కర్ మృతిని పెద్ద లోటుగా అభివర్ణించాడు. క్రికెట్‌పై లతాజీకి ఉన్న ఆసక్తిని ఆయన ప్రస్తావించారు. లతాజీకి క్రికెట్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఆమె ఈ ఆటను నిశితంగా చూసేదని పేర్కొన్నారు. లతా మంగేష్కర్ మృతి పట్ల టీమిండియా సంతాపం తెలిపిన సమాచారాన్ని బీసీసీఐ షేర్ చేసింది. లతా దీదీకి క్రికెట్ అంటే చాలా ఇష్టమని బీసీసీఐ ట్వీట్ చేసింది. ఆమె ఎల్లప్పుడూ ఈ క్రీడకు మద్దతు ఇచ్చేదని వ్యాఖ్యానించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. సాయంత్రం మంచు కురుస్తుండటంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

Multiple Organ Failure: మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మరణించిన లతామంగేష్కర్.. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకోండి..?

Lata Mangeshkar: ఒకటో తరగతి కూడా చదవలేదు.. కానీ 6 విశ్వవిద్యాలయాలు డాక్టరేట్‌ అందించాయి..

Valentines Day: వాలెంటైన్స్ డేకి మీ భాగస్వామితో కలిసి ఈ ప్రదేశాలు సందర్శిస్తే సూపర్..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి