- Telugu News Photo Gallery Cinema photos Lata mangeshkar life education and awards lata didi career achievements and memories
Lata Mangeshkar: ఒకటో తరగతి కూడా చదవలేదు.. కానీ 6 విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ అందించాయి..
Lata Mangeshkar: లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆమె మరణ వార్త వినడంతో అందరు శోకసంద్రంలో మునిగిపోయారు.
Updated on: Feb 06, 2022 | 2:44 PM

లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆమె మరణ వార్త వినడంతో అందరు శోకసంద్రంలో మునిగిపోయారు. లతా మంగేష్కర్ ఒకటో తరగతి కూడా చదవలేదు. కానీ ప్రపంచంలోని 6 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ పట్టాతో గౌరవించారు.

లతా మంగేష్కర్‌కు ఐదుగురు తోబుట్టువులు ఉన్నారు. వారిలో దీదీ పెద్దది. ఆమె సోదరీమణుల పేరు ఆశా, మీనా, ఉష, సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్. ఇతర పిల్లల్లాగే లతా మంగేష్కర్ కూడా చదువుకోవడానికి స్కూల్‌కి వెళ్లింది. అయితే ఒక సంఘటన తర్వాత ఆమె స్కూల్‌కి వెళ్లడం మానేసింది.

లతా మంగేష్కర్ 1929 సెప్టెంబర్ 28న ఇండోర్‌లో ప్రముఖ సంగీత విద్వాంసుడు దీనానాథ్ మంగేష్కర్‌కు జన్మించారు. లతా మంగేష్కర్ తండ్రి 1942లో మరణించారు. ఈ సమయంలో ఆమె వయస్సు 13 సంవత్సరాలు కుటుంబ బాధ్యత ఆమెపై పడింది.

ఆమె జీవితం నటిగా ప్రారంభమై ఆ తర్వాత గొప్ప గాయకురాలిగా మారింది. లతామంగేష్కర్ స్కూల్‌కి వెళ్లిన మొదటి రోజు పిల్లలకు పాటలు నేర్పుతున్నారు. టీచర్ ఆమెను ఆపడంతో ఆ తర్వాత స్కూల్‌కి వెళ్లలేదని ఓ కథనం ఉంది.

లతా మంగేష్కర్ కొన్నిసార్లు తన చెల్లెలు ఆశా భోంస్లేని తనతో పాటు స్కూల్‌కి తీసుకెళ్లేది. అయితే ఆమెని అనుమతించలేదు. దీంతో మరుసటి రోజు నుంచి పాఠశాలకు వెళ్లడం మానేసింది.



