Lata Mangeshkar: ధనవంతమైన బీసీసీఐకి సహాయం చేసిన లతా మంగేష్కర్.. ఎప్పుడంటే..

కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు లార్డ్స్‌లో ప్రపంచకప్‌ గెలిచినప్పుడు అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు...

Lata Mangeshkar: ధనవంతమైన బీసీసీఐకి సహాయం చేసిన లతా మంగేష్కర్.. ఎప్పుడంటే..
Lata Mangeshkar
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 06, 2022 | 8:49 PM

కపిల్ దేవ్(kapil dev) సారథ్యంలోని భారత జట్టు లార్డ్స్‌లో ప్రపంచకప్‌ గెలిచినప్పుడు అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు, ప్రధాని ఇందిరా గాంధీ,  మంత్రి ఎన్‌కెపి సాల్వే ఆటగాళ్లకు ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ అప్పట్లో భారత క్రికెట్ బోర్డు ధనవంతమైంది కాదు. నేటి క్రికెటర్ల మాదిరిగా అప్పట్లో క్రికెటర్లపై ధన వర్షం కురిపించలేదు. ఈరోజు BCCI 5 బిలియన్ డాలర్ల విలువైన TV ప్రసార ఒప్పందాన్ని కలిగి ఉంది. కానీ అప్పుడు ఆటగాళ్లు కేవలం 20 పౌండ్ల రోజువారీ భత్యం పొందేవారు. అలాంటి సమయంలో లతా మంగేష్కర్(Lata Mangeshkar) బీసీసీఐ(bcci)కి, భారత క్రికెట్‌కు సాయం చేసింది.

దీని కోసం సాల్వే, రాజ్‌సింగ్ దుంగార్‌పూర్‌ని సంప్రదించారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కచేరీ చేయాలని తన సన్నిహితురాలు, క్రికెట్ అభిమాని లతా మంగేష్కర్‌ను దుంగార్‌పూర్ అభ్యర్థించాడు. దానికి అంగీరించిన లతాజీ కిక్కిరిసిన స్టేడియంలో రెండు గంటలపాటు కార్యక్రమం చేశారు. బీసీసీఐ ఆ కచేరీ నుండి చాలా డబ్బు వసూలు చేసింది. మొత్తం 14 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అందించింది. సునీల్ వాల్సన్ గుర్తుకొచ్చాడు

1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న సునీల్ వాల్సన్ పిటిఐతో మాట్లాడుతూ, ‘అప్పట్లో ఇది చాలా పెద్ద మొత్తం. లేకపోతే, మేము టూర్, రోజువారీ భత్యం నుండి రూ.60000 డబ్బును ఆదా చేసుకోవలసి వచ్చేది. కొంతమంది మాకు 5000 లేదా 10000 రూపాయలు వాగ్దానం చేశారు, ఇది చాలా అవమానకరంగా ఉంది. అయితే ఆ తర్వాత లతాజీ కచేరీ చేశారు. కచేరీ అద్భుతంగా ఉంది. ఆమె ప్రత్యక్షంగా పాడటం చూడటం మరచిపోలేనిది. లతా జీ కోసం రెండు టిక్కెట్లు రిజర్వ్ చేస్తారు

BCCI ఆమె సహకారాన్ని మరచిపోలేదు. గౌరవ సూచకంగా భారతదేశంలోని ప్రతి స్టేడియంలో ఆమెకు అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం రెండు VIP పాస్‌లు కేటాయిస్తున్నారు. ప్రతి మ్యాచ్‌కు స్పాన్సర్‌లు, రాష్ట్ర సంఘాల కోటా ఉన్నట్లే, ప్రతి మ్యాచ్‌లోనూ లతాజీకి రెండు టిక్కెట్లు ఉంచినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మంగేష్కర్ కుటుంబానికి క్రికెట్ అంటే పిచ్చి.

స్టేడియంలో మ్యాచ్‌లు చూసేవారు

ముంబయికి చెందిన సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ మకరంద్ వైంగాంకర్ మాట్లాడుతూ 60వ దశకంలో లతా మంగేష్కర్ క్రమం తప్పకుండా సిసిఐ స్టేడియానికి వచ్చేవారు. ఆ తర్వాత 70, 80లలో వాంఖడే స్టేడియంలో ఇది కనిపించింది. లతాజీ, ఆయన సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్‌లు టెస్టు మ్యాచ్‌లు చూసేందుకు బ్రబౌర్న్‌ స్టేడియానికి ఎప్పుడూ వచ్చేవారు. ఆమె ఎంత బిజీగా ఉన్నా డెబ్బైల్లో ప్రతి మ్యాచ్ చూసేందుకు వచ్చేది.” అని చెప్పారు.

Read Also.. U19 World Cup: అచ్చం ధోనీ తరహాలో ముగించాడు.. దినేష్ బానాపై అభిమానుల ప్రశంసలు..

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..