IND vs WI, 1st ODI Highlights: తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం.. ఆకట్టుకున్న రోహిత్, చాహల్..!
IND vs WI Highlights in Telugu: భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతోన్న వన్డే సిరీస్‌లోని తొలి వన్డేలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేలో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి రోహిత్ సేన దూసుకెళ్లింది.
అహ్మదాబాద్ వేదికగా జరుగుతోన్న వన్డే సిరీస్ (India vs West Indies, 1st ODI) తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. అద్భుత ప్రదర్శనతో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి వెస్టిండీస్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 177 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా(Team India) కేవలం 28 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 1000వ వన్డేలో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ(Rohit Sharma) 60, ఇషాన్ కిషన్ 28 పరుగులతో కీలక భాగస్వామ్యం అందించడంతోపాటు చివర్లో సూర్యకుమార్ 34, దీపక్ హుడా 26 పరుగులతో కీలక భాగస్వామ్యం అందించి విజయాన్ని అందించారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో దూసుకెళ్లింది. విరాట్ 8, పంత్ 11 పరుగులు చేశారు.
భారత ప్లేయింగ్ ఎలెవన్ – రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, ప్రసీద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్
వెస్టిండీస్ ప్లేయింగ్ XI – బ్రాండన్ కింగ్, షే హోప్, షమర్త్ బ్రూక్స్, డారెన్ బ్రావో, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్, జాసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, అకిల్ హొస్సేన్
LIVE Cricket Score & Updates
-
తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
అహ్మదాబాద్ వేదికగా జరుగుతోన్న వన్డే సిరీస్ (India vs West Indies, 1st ODI) తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. అద్భుత ప్రదర్శనతో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి వెస్టిండీస్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 177 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా(Team India) కేవలం 28 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది.
-
25 ఓవర్లకు టీమిండియా స్కోర్..
25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే ఇంకా 17 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం సూర్యకుమార్ 24, దీపక్ హుడా 18 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
-
20 ఓవర్లకు టీమిండియా స్కోర్..
20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు పూర్తి చేసింది. సూర్యకుమార్ యాదవ్ 13(14), దీపక్ హుడా 7(6) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా..
అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్(11 పరుగులు, 9 బంతులు, 2 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. నాన్ స్ట్రైక్‌లో ఉన్న రిషబ్.. సూర్య కుమార్ కొట్టిన ఓ బంతి బౌలర్‌కు తాకి నేరుగా వెళ్లి వికెట్లను తాకడంతో రిషబ్ పంత్ ఔటయ్యాడు.
-
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా..
అకేల్ హోసేన్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్(28, 36 బంతులు, 1 సిక్స్, 2 ఫోర్లు) పెవిలియన్ చేరారు. ప్రసుతం 17 ఓవర్లకు టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 61 పరుగుల దూరంలో నిలిచింది.
-
-
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా..
జోసఫ్ బౌలింగ్‌లో టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ(60), విరాట్ కోహ్లీ(8) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ప్రసుతం 14 ఓవర్లకు టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 84 పరుగుల దూరంలో నిలిచింది.
-
తొలి వికెట్ కోల్పోయిన భారత్
జోసఫ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ(60) పరుగుల వద్ద ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో 84 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.
-
అర్థసెంచరీ పూర్తి చేసిన రోహిత్
1000వ వన్డేలో సారధిగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ.. అద్భుత ఇన్నింగ్స్‌తో కేవలం 43 బంతుల్లోనే తన అర్థసెంచరీని పూర్తి చేశాడు. ఇది వన్డేల్లో రోహిత్‌కు 44 వన్డే ఫిఫ్టీ. ఇందులో 8 ఫోర్లు, 1 సిక్స్ కూడా ఉంది.
-
భారత ఇన్నింగ్స్‌లో తొలి సిక్స్..
స్వల్ప స్కోర్ ఛేదనలో టీమిండియా ఓపెనర్లు దూకుడు పెంచారు. వెస్టిండీస్ బౌలర్లపై విరుచుకపడుతూ బౌండరీలు సాధిస్తున్నారు. అయితే 9.5 ఓవర్లో రోహిత్ రెండు బౌండరీలతో పాటు ఓ భారీ సిక్స్ కూడా బాదేశాడు. ఇదే భారత ఇన్నింగ్స్‌లో తొలి సిక్స్ కావడం గమనార్హం.
-
50 పరుగులు దాటిన టీమిండియా
టీమిండియా స్కోర్ 50 పరుగులకు చేరుకుంది. 9.1 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 56 పరుగులతో దూసుకపోతోంది. క్రీజులో రోహిత్ 35, ఇషాన్ 14 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇందులో రోహిత్ 7 ఫోర్లు, ఇషాన్ 2 ఫోర్లు బాదేశారు.
-
దూకుడు పెంచిన రోహిత్, ఇషాన్
177 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తొలుత కొంత ఆచితూచి ఆడారు. నిలదొక్కుకున్న తర్వాత దూకుడు పెంచిన వీరిద్దరూ బౌండరీలతో స్కోర్ బోర్డును పెంచే పనిలో పడ్డారు. ప్రస్తుతం 8. 1 ఓవర్లకు 50 పరుగులు చేసింది. ఇషాన్ 13, రోహిత్ 30 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
టీమిండియా టార్గెట్ 177
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీం 176 పరుగులకు ఆలౌట్ అయింది. జాసన్ హోల్డర్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో యుజేంద్ర చాహల్ 4, వాషింగ్టన్ సుందర్ 3, ప్రసీద్ధ్ 2, మహ్మద్ సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు.
-
ఏడో వికెట్ కోల్పోయిన విండీస్..
అకేల్ హోసేన్(0) ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రసీద్ధ్ బౌలింగ్ అకేల్ హోసేన్ పెవిలియన్ చేరాడు. దీంతో విండీస్ టీం 22.5 ఓవర్లకు 79 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది.
-
ఆరో వికెట్ కోల్పోయిన విండీస్..
షమర్ బ్రూక్స్(12) ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. చాహల్ బౌలింగ్ షమర్ బ్రూక్స్ పెవిలియన్ చేరాడు. దీంతో విండీస్ టీం 21.5 ఓవర్లకు 78 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది.
-
ఐదు వికెట్లు కోల్పోయిన విండీస్..
కీరన్ పొలార్డ్(0) ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. చాహల్ బౌలింగ్ కీరన్ పొలార్డ్ పెవిలియన్ చేరాడు. దీంతో విండీస్ టీం 71 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది.
-
మూడో వికెట్ కోల్పోయిన విండీస్..
డారెన్ బ్రావో(18) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ బ్రావో పెవిలియన్ చేరాడు. దీంతో విండీస్ టీం 45 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బ తీశాడు.
-
రెండో వికెట్ కోల్పోయిన విండీస్..
వాషింటన్ సుందర్ బౌలింగ్‌లో బ్రాండన్ (13) పెవిలియన్ చేరాడు.
-
10 ఓవర్లకు విండీస్ స్కోర్ 39/1
వెస్డిండీస్ టీం 10 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 39 పరుగులు చేసింది. క్రీజులో డారెన్ బ్రావో 17, బ్రాండన్ కింగ్ 13 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
-
తొలి వికెట్‌ను కోల్పోయిన వెస్టిండీస్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ టీంను సిరాజ్ తొలి దెబ్బ తీశాడు. సిరాజ్ బౌలింగ్‌లో షాయ్ హోప్(8) బౌల్డ్ అయ్యాడు. దీంతో విండీస్ టీం 13 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.
-
నల్ల బ్యాడ్జీతో మైదానంలోకి టీమిండియా..
ఈరోజు భారత జట్టు ఆటగాళ్లు నల్ల బ్యాడ్జ్‌తో మైదానంలోకి దిగారు. ప్రముఖ భారతీయ గాయని లతా మంగేష్కర్ మృతికి సంతాపంగాా ఈ నిర్ణయం తీసుకున్నారు.
-
దీపక్ హుడా అరంగేట్రం
Congratulations to @HoodaOnFire who is all set to make his debut for #TeamIndia. #INDvWI pic.twitter.com/849paxXNgM
— BCCI (@BCCI) February 6, 2022
-
వెస్టిండీస్ ప్లేయింగ్ XI
వెస్టిండీస్ ప్లేయింగ్ XI – బ్రాండన్ కింగ్, షే హోప్, షమర్త్ బ్రూక్స్, డారెన్ బ్రావో, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్, జాసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, అకిల్ హొస్సేన్
-
భారత్ టాస్ గెలిచింది
భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. వెస్టిండీస్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
-
భారత్ నేడు 1000వ వన్డే ఆడనుంది
భారత్, వెస్టిండీస్ మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈరోజు ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది.
Published On - Feb 06,2022 1:35 PM