AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Cricketer: గుంటూరు జిల్లా నుంచి మిర్చిలాంటి ప్లేయర్.. అండర్‌-19 వరల్డ్‌ కప్‌‌ విజయంలో కీ రోల్..

India U-19 batter Shaik Rasheed: షేక్‌ రషీద్‌ ప్రాపర్‌.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని మల్లయ పాలెం. తండ్రి బలీషా వలీ లోన్‌ రికవరీ ఏజెంట్‌. సంపాదన అంతంతమాత్రమే కానీ.. కొడుకులో క్రికెట్‌పై ఉన్న తపనను గుర్తించి ట్రైనింగ్‌ ఇప్పించాడు.

Andhra Cricketer: గుంటూరు జిల్లా నుంచి మిర్చిలాంటి ప్లేయర్.. అండర్‌-19 వరల్డ్‌ కప్‌‌ విజయంలో కీ రోల్..
Ap Cricketer Rasheed
Ram Naramaneni
|

Updated on: Feb 06, 2022 | 7:02 PM

Share

ICC Under-19 World Cup: సెంచరీలు కొట్టడం అంటే మహా సరదా. ప్రత్యర్థి ఎవరైనా.. టోర్నీ ఏదైనా.. గ్రౌండ్‌లోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. ఏడేళ్ల ప్రాయంలో బ్యాట్‌ పట్టిన గుంటూరు(Guntur) చిచ్చర పిడుగు షేక్ రషీద్.. భారత్‌కు ఒంటి చేత్తో అండర్‌-19 వరల్డ్‌ కప్‌ను అందించాడు. అండర్‌ 19లో గుంటూరు కుర్రాడు ఇప్పుడో సెన్షేషన్‌. షేక్‌ రషీద్‌ ప్రాపర్‌.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని మల్లయ పాలెం(Mallayapalem). తండ్రి బలీషా వలీ లోన్‌ రికవరీ ఏజెంట్‌. సంపాదన అంతంతమాత్రమే కానీ.. కొడుకులో క్రికెట్‌(Cricket)పై ఉన్న తపనను గుర్తించి ట్రైనింగ్‌ ఇప్పించాడు. తొమ్మిదేళ్లకే అండర్‌-14 క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రషీద్‌ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. అంతర్‌ జిల్లాల పోటీల్లో శ్రీకాకుళంపై పన్నెండేళ్ల వయస్సులోనే ట్రిపుల్‌ సెంచరీ కొట్టి అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. 2017లో అండర్‌-16 కేటగిరీలో 674 పరుగులు చేసి ఆ టోర్నీలోనే హయ్యెస్ట్ రన్నర్‌గా రషీద్ నిలిచాడు. తర్వాతి ఏడాది అండర్‌-19లో 680 రన్స్‌తో నేషనల్‌ లెవెల్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో సెకండ్ ప్లేస్‌ కైవసం చేసుకున్నాడు.

లెటెస్ట్‌గా అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో వీరబాదుడుతో మళ్లీ అందర్నీ తనవైపు తిప్పుకున్నాడు. బ్యాటింగ్‌లో రాణించి విజయాల్లో కీ రోల్ పోషించాడు.  వరల్డ్ కప్‌లో రషీద్ ఆడిన నాలుగు మ్యాచ్‌లో రెండు అర్ధసెంచరీలతో సత్తాచాటాడు. దీంతో పేరెంట్స్‌తో పాటు గుంటూరు జిల్లా మొత్తం మురిసిపోతుంది. పుజారాలా డిఫెన్స్‌.. సెహ్వాగ్‌ లాగా ఎదురు దాడి చేయగల రషీద్‌ ఇప్పటికే సెలెక్టర్ల దృష్టిలోపడ్డాడు. అతని మణికట్టు ఆట చూసి ముచ్చటపడని క్రికెటర్‌ లేడంటే అతిశయోక్తి కాదు. త్వరలో టీమిండియాలో చోటు ఖాయం అంటున్నారు ఎక్స్‌పర్ట్‌లు.

Also Read: AP: వామ్మో.. ఇలా తయారయ్యారేంట్రా బాబు.. ట్యాంకర్‌ను ఆపి చెక్ చేస్తే అవాక్కు

టమాటా లోడ్ అనుకుంటే పొరబడినట్లే.. లోపల చెక్ చేస్తే కళ్లు చెదిరాయి