Andhra Pradesh: టమాటా లోడ్ అనుకుంటే పొరబడినట్లే.. లోపల చెక్ చేస్తే కళ్లు చెదిరాయి

పోలీసుల కళ్లు గప్పి ఏపీకి చెందిన అత్యంత విలువైన కలుపను తరలించేందుకు చాలా క్రియేటివ్‌గా థింక్ చేస్తున్నారు స్మగ్లర్లు. ఇప్పటివరకు పండ్ల లోడు మాటున.. ఆహార పదార్థాల మాటున.. పాల వ్యాన్లు లోపల రూపంలో ఎర్రచందనం తరలించేందుకు ప్రయత్నించిన చాలామంది స్మగ్లర్స్.. పోలీసులకు చిక్కారు.

Andhra Pradesh: టమాటా లోడ్ అనుకుంటే పొరబడినట్లే.. లోపల చెక్ చేస్తే కళ్లు చెదిరాయి
Red Sandalwood Smuggling(Representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 06, 2022 | 4:08 PM

Sandalwood smugglers: చిత్తూరు జిల్లా(chittoor district)లో పుష్ప సీన్‌ వెలుగు చూసింది. ఎర్రచందనం స్మగ్లర్లు పుష్ప(Pushpa) సినిమా చూసి కొత్త ఐడియాలకు తెరతీశారు. అక్కడ హీరో తగ్గేదేలే అంటే.. అంతా విజిల్స్‌ వేశారు. కాని ఇక్కడ పుష్ప కటకటాలపాలయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. చంద్రగిరి(Chandragiri)లో టమాటా రవాణా ముసుగులో ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్‌కు దిగాడు ఓ దుండగుడు. పుష్ప సినిమాలో పాల వాహనంలో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్‌ చేసినట్లు.. ఇక్కడ టమాటా రవాణా ముసుగులో ఇలా చేశాడు. ట్రాలీలో కింద ఎర్రచందనం దుంగలను ఉంచి.. పైన టమాటా ట్రేలు పెట్టాడు. చెకింగ్‌ పాయింట్‌ దగ్గర పోలీసులకు అనుమానం రాకుండా చూసుకున్నా.. చివరికి దొరికిపోయాడు. మొత్తం 14 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లగేజీ వాహనంతో సహా దుంగలను చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్మగ్లర్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

కాగా  ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం.. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో ఉన్న శేషాచలం కొండల్లో మాత్రమే దొరుకుతుంది. శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ క్వాలిటీ ఉండడంతో దానికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.  జపాన్, చైనా, రష్యాలలో ఎర్ర చందననాన్ని వివిధ రూపాల్లో వినియోగిస్తుంటారు. చైనా, జపాన్‌లలో వంటింట్లో వాడే పాత్రలు, గిన్నెలు కూడా ఎర్రచందనంతో చేసినవి వాడుతుంటారు. సంగీత వాయిద్యాలు తయారు చేసి పెళ్లిళ్ల లో బహుమతిగా ఇస్తుంటారు.  విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి స్మగ్లర్లు అనేక మార్గాల్లో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారు.

కడప జిల్లాలో అంతర్రాష్ట్ర స్మగ్లర్ అరెస్ట్…

కడప జిల్లా ఆకులనారాయణపల్లిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఇల్లీగల్ గా ఎర్ర చందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అన్భురాజన్‌ వివరించారు. అరెస్టయిన వారిలో అంతర్రాష్ట్ర స్మగ్లర్ ఉన్నాడని.. అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. నిందితుల నుంచి రెండు వాహనాలను, 20 ఎర్ర చందనపు దుంగలను స్వాధీనం చేసుకున్నామని అన్బురాజన్ చెప్పారు. ఎర్రచందనం దుంగలు రవాణా చేసే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, తరుచూ దాడులు నిర్వహిస్తామని చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు.

Also Read: ఒక్క చేపతో లక్కు తిరిగిపోయింది.. వేలంలో ఎంత పలికిందో తెలిస్తే షాక్ తింటారు

 అతడో హెడ్ కానిస్టేబుల్.. ఏం స్మగ్లింగ్ చేస్తున్నాడో తెలిస్తే మీరు షాకవ్వడం ఖాయం