Nellore District: అతడో హెడ్ కానిస్టేబుల్.. ఏం స్మగ్లింగ్ చేస్తున్నాడో తెలిస్తే మీరు షాకవ్వడం ఖాయం
అతడో పోలీస్.. కానీ ట్రాక్ తప్పాడు. అక్రమ మార్గంలో సంపాదించాలని ఆశపడ్డాడు. కానీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నేరస్థులకు బేడీలు వేయాల్సిన వ్యక్తే.. ఇప్పుడు చేతికి బేడిలతో కనిపించాడు.
Turtles Smuggling: అతడో పోలీస్. అన్యాయాలు జరగకుండా చూడాలి. అక్రమార్కుల తాట తీయాలి. కానీ అతడే ట్రాక్ తప్పాడు. డబ్బు కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. పలువురికి బేడీలు వేయాల్సిన వ్యక్తి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇంతకీ అతడు చేసింది.. ఏం తప్పో చెప్పలేదు కదూ.. స్మగ్లింగ్. అది కూడా అరుదైన వన్యప్రాణి సంపదను. నక్షత్ర తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని నెల్లూరు జిల్లాలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. చెన్నై(Chennai)కు చెందిన సెల్వ కుమార్ 1 కాదు, 2 కాదు.. 10 కాదు ఏకంగా… 250 తాబేళ్లను స్మగ్లింగ్ చేయాలని చూశాడు. అందుకు అతడు ఆర్టీసీ బస్సును ఎంచుకున్నాడు. బస్సు అయితే ఎవరికీ అనుమానం రాదని భావించాడు. కనిగిరి(Kanigiri) ఆర్టీసీ బస్సులో తమిళనాడుకు నక్షత్ర తాబేళ్లు తీసుకెళ్లుతుండగా… బీవీ పాలెం వద్ద నిర్వహించిన తనిఖీల్లో దొరికిపోయాడు. పట్టుబడిన నిందితుడు చెన్నై ఆవడి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చెన్నైలో ఎక్వేరియం నడుపుతున్న నిందితుడు… బెంగాల్(Bengal), కర్ణాటక(Karnataka) తదితర రాష్ట్రాలకు వివిధ రకాల వన్యప్రాణులను ఎగుమతి చేస్తున్నట్లు వివరించారు. వీటి విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని… వీటిని చెన్నై నుండి మలేషియాకు తరలించి ఎనిమిది నుండి పది లక్షల రూపాయలు మధ్య అమ్మకాలు సాగిస్తూనట్లు వెల్లడైందని తెలియజేశారు. స్వాధీనం చేసుకున్న నక్షత్ర తాబేళ్లను వెంకటగిరి అటవీశాఖ అధికారులకు అందజేయనున్నట్లు… స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు తెలిపారు.
Also Read: లవ్ మ్యారేజ్ చేసుకుని.. ఇతరులతో శృంగారానికి ఆమెను ఒప్పించి.. వికృత ఆనందం