Srinagar Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..

Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో యాంటీ టెర్రర్‌ ఆపరేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. శనివారం శ్రీనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు

Srinagar Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..
Encounter
Shaik Madarsaheb

|

Feb 05, 2022 | 9:58 AM

Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో యాంటీ టెర్రర్‌ ఆపరేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. శనివారం శ్రీనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌లోని (Srinagar) జకురా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య శనివారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌ (Encounter) లో ఇద్దరు లష్కరే తోయిబా/ టీఆర్‌ఎఫ్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని ఇఖ్లాక్ హజామ్‌గా గుర్తించారు. ఇటీవల అనంత్‌నాగ్‌లోని హసన్‌పోరాలో హెడ్ కానిస్టేబుల్ అలీ మహమ్మద్ ఘనీని హతమార్చడంలో ఈ ఉగ్రవాది ప్రమేయం ఉన్నట్లు (JK) శ్రీనగర్ పోలీసులు తెలిపారు. 2 పిస్టల్స్‌ సహా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ ఐజిపి తెలియపారు.

కాగా.. శ్రీనగర్ జకురా ప్రాంతంలోనే మరో ఎన్‌కౌంటర్ సైతం ప్రారంభమైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

గత వారం అనంత్‌నాగ్‌లోని హసన్‌పోరా బిజ్‌భేరా ప్రాంతంలోని తన నివాసానికి సమీపంలో సాయంత్రం 5.35 గంటలకు 53 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఘనీని అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అతను కుల్గామ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు.

Also Read:

PM KISAN Samman Nidhi Yojana: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు ఎప్పుడు వస్తాయంటే..!

India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్నంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu