PM KISAN Samman Nidhi Yojana: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు ఎప్పుడు వస్తాయంటే..!

PM KISAN Samman Nidhi Yojana: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. రైతులు..

PM KISAN Samman Nidhi Yojana: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు ఎప్పుడు వస్తాయంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 05, 2022 | 9:50 AM

PM KISAN Samman Nidhi Yojana: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. కేంద్రం రైతుల కోసం తీసుకువచ్చిన స్కీమ్‌లలో పీఎం కిసాన్ (PM Kisan) సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులు ప్రతి ఏడాది రూ. 6 వేల చొప్పున అందిస్తోంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారిగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఏడాదికి మూడు విడతల్లో రైతుల అకౌంట్లలో జమ అవుతున్నాయి. ఇప్పటికే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి 10 విడతల డబ్బులు జమ అయ్యాయి.

ఇక మోడీ ప్రభుత్వం రైతులకు 11వ విడత డబ్బులు అందించనుంది. మరి ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసుకుందాం. ప్రతి ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత డబ్బులు ఏప్రిల్‌ 1 నుంచి జూలై 31వ తేదీ లోపు రైతుల అకౌంట్లలో జమ చేయవచ్చు. ఇక రెండో విడత డబ్బులు ఆగస్టు 1 నుంచి నవంబర్‌ 30వ తేదీ లోపు రైతుల బ్యాంకు ఖాతాల్లో చేరుతాయి. ఇక మూడో విడత డిసెంబర్‌ 1 నుంచి మార్చి 31వ తేదీ లోపు ఎప్పుడైనా రైతుల ఖాతాల్లో జమ కావచ్చు.

ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే..

* ముందుగా పీఎం కిసాన్ పోర్టల్ pmkisan.gov.in ఓపెన్ చేయాలి.

* ఆ తర్వాత FARMER CORNERS ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

* కొత్త ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

* ఆ తర్వాత మరో న్యూ విండో ఓపెన్ అవుతుంది.

* అందులో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా పూర్తి చేయాలి.

* ఆ తర్వాత బ్యాంక్ ఖాతా సమాచారాన్ని పూరించేప్పుడు.. , IFSC కోడ్‌ను సరిగ్గా నింపి దాన్ని సేవ్ చేయాలి.

* ఆ తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ భూమి వివరాలు ఎంటర్ చేయాలి.

* అందులో ఖాస్రా నంబర్, ఖాతా నంబర్ ఎంటర్ చేసి సేవ్ చేయాలి.

* ఇప్పుడు మీ రిజిస్టర్ ప్రక్రియ పూర్తవుతుంది.

PM కిసాన్ అప్లికేషన్ కోసం అవసరమైన పత్రాలు

► భూమి యొక్క అసలు పత్రాలు

► దరఖాస్తుదారు బ్యాంక్ పాస్‌బుక్

► ఓటరు గుర్తింపు కార్డు

► పాస్‌పోర్ట్ సైజు ఫోటో

► గుర్తింపు కార్డు

► డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్

► మీ యాజమాన్యంలో ఉన్న భూమి యొక్క పూర్తి వివరాలు.

► నివాస ధృవీకరణ పత్రం

ఇవి కూడా చదవండి:

Edible Oils: వంట నూనె నిల్వలపై పరిమితులు పెంపు.. ధరలు మరింతగా తగ్గించేందుకు కేంద్రం చర్యలు

Tyre Companies: ఐదు టైర్‌ కంపెనీలకు భారీ జరిమానా విధించిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా