Tyre Companies: ఐదు టైర్ కంపెనీలకు భారీ జరిమానా విధించిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా
Tyre Companies: టైర్ కంపెనీలు కుమ్మక్కయ్యి కస్టమర్లను మోసం చేస్తూ భారీగా ధరలను పెంచుతున్నట్లు ఆరోపణలు రావడంతో కాంపిటీషన్..
Tyre Companies: టైర్ కంపెనీలు కుమ్మక్కయ్యి కస్టమర్లను మోసం చేస్తూ భారీగా ధరలను పెంచుతున్నట్లు ఆరోపణలు రావడంతో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ( CCI ) ఐదు టైర్ కంపెనీలపై మొత్తం రూ. 1788 కోట్ల జరిమానా విధించింది . అపోలో టైర్స్, MRF, CEAT, JK టైర్, బిర్లా టైర్స్ పై ఈ చర్యలు చేపట్టింది. అయితే కాంపిటీషన్ కమిషన్ ఆప్ ఇండియా(సీసీఐ) జరిమానా వేయడంతో టైర్ కంపెనీల్లోని కొన్నింటి షేర్లు ఈ రోజు(గురువారం) అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కార్టలైజేషన్ చేసినందుకు గాను రూ. 1,788 కోట్ల మేర జరిమానాను సీసీఐ విధించింది. అయితే ఈ. ఐదు కంపెనీలు ఇలా కావాలనే తమకు సంబంధించిన కొన్ని బ్రాండ్ల , విభాగాల టైర్ల ధరలు పెంచినట్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ధారించింది.
అపోలో టైర్స్‌పై రూ.425 కోట్లు, ఎంఆర్‌ఎఫ్‌పై రూ.622 కోట్లు, సీట్‌పై రూ.252 కోట్లు, జేకే టైర్‌పై రూ.310 కోట్లు, బిర్లా టైర్స్‌పై రూ.178 కోట్లు జరిమానా విధించారు. ఈ టైర్ కంపెనీలు తమలో తాము కుమ్మక్కై ధరలను పెంచడం, మార్కెట్లో నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ జరిమానా పడింది. ఈ కంపెనీలు ఈ సమాచారాన్ని ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ( ATMA) ప్లాట్‌ఫారమ్‌కు బదిలీ చేశాయని, టైర్ల ధరలపై కలిసి నిర్ణయం తీసుకున్నట్లు తమ విచారణలో తేలినట్లు CCI తెలిపింది. రీప్లేస్‌మెంట్ మార్కెట్‌లో విక్రయించే క్రాస్-ప్లై/బయాస్ టైర్ వేరియంట్‌ల ధరల పెంపు, ఉత్పత్తి, సరఫరాను పరిమితం చేయడానికి, నియంత్రించడానికి ATMA ఈ ఐదు కంపెనీలతో కలిసి పనిచేసింది.
CCI పరిశోధన ప్రకారం.. ATMA కంపెనీ ఆధారిత, సెగ్మెంట్ ఆధారిత ఉత్పత్తి, దేశీయ విక్రయాలు, ఎగుమతులపై డేటాను సేకరించి పరిశీలన చేసింది.. అందుకే అసోసియేషన్ ఆఫ్ టైర్ కంపెనీస్ ఏటీఎంఏపై కూడా రూ.84 వేలు జరిమానా విధించారు. అంతేకాకుండా సంస్థ సభ్యుల నుండి టోకు, రిటైల్ ధరలను వసూలు చేయకూడదని కూడా ATMAను ఆదేశించింది.
CCI ने पांच टायर कंपनियों और इनके संगठन पर मिलाकर 1788 करोड़ रुपए का जुर्माना लगाया है. कौन हैं ये पांच कंपनियां, किस कंपनी पर कितना जुर्माना लगा है और आखिर क्यों लगाया गया है ये जुर्माना. जानने के लिए देखें ये वीडियो-@abhishri2014 @sandeepgrover09 pic.twitter.com/pPG14M7wmj
— Money9 (@Money9Live) February 3, 2022
ఇవి కూడా చదవండి: