AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్నంటే..

India Covid-19 Updates: దేశంలో కరోనా (Coronavirus) కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో (శుక్రవారం) కేసుల సంఖ్య భారీగా తగ్గింది.

India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్నంటే..
Shaik Madar Saheb
|

Updated on: Feb 05, 2022 | 9:39 AM

Share

India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. థర్డ్‌వేవ్ ప్రారంభంలో ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసులు భారీగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా (Coronavirus) కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో (శుక్రవారం) కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశవ్యాప్తంగా నిన్న 1,27,952 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 1059 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో గతంలో నమోదైన మరణాల సంఖ్యలో మార్పులు చోటుచేసుకుంటుండంతో మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. నిన్నటితో పోల్చుకుంటే.. దాదాపు 22 వేల కేసులు తగ్గాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 2,30,814 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 13,31,648 కేసులు యాక్టివ్‌గా (Active cases) ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 5,01,114 బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,68,98,17,199 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

Also Read:

Chendupatla Janga Reddy: బీజేపీ కురువృద్ధుడు చందుపట్ల జంగారెడ్డి కన్నుమూత..

Viral Video: ముచ్చింతల్‌లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.. వైరల్‌ అవుతున్న శఠగోపం వీడియో

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!