Chendupatla Janga Reddy: బీజేపీ కురువృద్ధుడు చందుపట్ల జంగారెడ్డి కన్నుమూత..

Chendupatla Janga Reddy Passes Away: బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగారెడ్డి (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో

Chendupatla Janga Reddy: బీజేపీ కురువృద్ధుడు చందుపట్ల జంగారెడ్డి కన్నుమూత..
Chendupatla Janga Reddy
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 05, 2022 | 12:18 PM

Chendupatla Janga Reddy Passes Away: బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగారెడ్డి (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి హైదరాబాద్‌లో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చందుపట్ల (Chendupatla Janga Reddy) ఆకస్మిక మృతికి పలువురు నాయకులు సంతాపం తెలిపారు. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన చందుపట్ల జంగారెడ్డి 18 నవంబర్ 1935 న జన్మించారు. ఆయన 1953లో సి.సుధేష్ణను వివాహం చేసుకున్నారు. చందుపట్ల జంగారెడ్డి దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన హన్మకొండలో నివాసం ఉంటున్నారు. 1984లో బీజేపీ (BJP) నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలో జంగారెడ్డి ఒకరు. అప్పట్లో హనుమకొండ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై 54 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో జంగారెడ్డి గెలుపొందారు.

అయితే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్‌సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి. ఈ ఎన్నికల్లో వాజ్‌పేయ్, అద్వానీ వంటి బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలయినా జంగారెడ్డి విజయం సాధించారు. జంగారెడ్డి రాజకీయాల్లోకి రాకముందు కొద్ది రోజులు ప్రభుత్వ పాఠశాలలో హయ్యర్ సెకండరీ ఉపాధ్యాయుడిగా పనిచేశారు.

జంగారెడ్డి 1967-72 (పర్కల్ నుండి జనసంఘ్ సభ్యునిగా), 1978-83 (శ్యాంపేట నుండి జనతా పార్టీ సభ్యునిగా), 1983-84 (బిజెపి సభ్యునిగా శ్యాంపేట నుండి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1984లో 8వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.

జంగారెడ్డి మరణవార్తపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన జంగారెడ్డి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు.

Also Read:

PM Narendra Modi: నేడే ప్రధాని మోడీ రాక.. స్వాగతం పలకనున్న సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ఇలా..

PM Narendra Modi: హైదరాబాద్‌ పర్యటనకు ముందు ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్‌.. ఏమన్నారో తెలుసా?