Kakinada: ఒక్క చేపతో లక్కు తిరిగిపోయింది.. వేలంలో ఎంత పలికిందో తెలిస్తే షాక్ తింటారు

మత్స్యకారుల వలకు 30 కిలోలు ఉన్న కచ్చిడి చేప చిక్కింది. దీనిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. ఆడ, మగ చేపల్లో.. ఈ రకం మగ చేపకు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ చేప ప్రత్యేకతలు తెలుసుకుందా పదండి..

Kakinada: ఒక్క చేపతో లక్కు తిరిగిపోయింది.. వేలంలో ఎంత పలికిందో తెలిస్తే షాక్ తింటారు
Kachidi Fish
Follow us

|

Updated on: Feb 06, 2022 | 3:22 PM

Kachidi Fish: తూర్పుగోదావరి జిల్లా(East Godavari district)కాకినాడ ఫిషింగ్ హార్బర్‌లో స్థానిక మత్స్యకారుల వలలో 30 కిలోల పైనే మగ కచ్చిడి చేప చిక్కింది. దీన్ని స్థానిక ఫిషింగ్ హార్బర్​లో వేలం వేయగా రూ.4.60 లక్షలకు స్థానిక వ్యాపారి రత్నం కొనుగోలు చేశారు. అరుదుగా చిక్కే ఈ చేపలను కలకత్తా(Kolkata)కు ఎగుమతి చేస్తామని వ్యాపారి తెలిపారు. మగ చేప మాత్రమే అంత విలువ ఉంటుందని, ఈ చేప పొట్టలోని తిత్తులు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని, మత్స్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తో తయారు చేస్తారట. అరుదుగా లభించే ఈ కచ్చిడి చేపను వేలంలో దక్కించుకునేందుకు వ్యాపారస్తులు ఎగబడ్డారు. సముద్రంలో చాలా అరుదుగా కచ్చిడి చేపలు దొరకుతాయని మత్సకారులు తెలిపారు. కచిడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్‌ అని కూడా పిలుస్తారు. నిజంగానే ఈ చేప దొరికితే మత్స్యకారులు తమకు బంగారం దొరికనట్టే అని చెబుతారు. ఒక్కటి వలలో చిక్కినా తమ పంట పండినట్టే అని చెబుతుంటారు. కాగా ఈ చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదు. ఒక చోట నుంచి మరో చోటికి ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటుంది.

ఖరీదైన వైన్‌ తయారీలోనూ ఈ లక్కి ఫిష్‌ శరీర భాగాలను వినియోగిస్తుంటడంతో గోల్డ్‌ఫిష్‌ మరింత కాస్ల్టీగా మారిపోయింది. ఈ చేపలు దొరకాలంటే మత్స్యకారుల లక్ తిరగాల్సిందే. మార్కెట్‌లో సూపర్‌ ధర పలుకుతున్న ఈ చేపను ప్రొటోలిసియా డయాకాన్సన్‌ అనే సాంకేతిక నామంతో పిలుస్తుంటారు. మొత్తంగా చేపలందు కచిడి చేపలు వేరయ్యా!

Also Read:  Nellore District: అతడో హెడ్ కానిస్టేబుల్.. ఏం స్మగ్లింగ్ చేస్తున్నాడో తెలిస్తే మీరు షాకవ్వడం ఖాయం

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సరయుపై కేసు నమోదు.. ఎందుకంటే

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ