AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సరయుపై కేసు నమోదు.. ఎందుకంటే

Youtuber Sarayu Roy: యూట్యూబ్‌ నటి సరయుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సరయుపై చర్యలు తీసుకోవాలంటూ వీహెచ్‌పీ నేత ఒకరు పోలీసులను ఆశ్రయించారు.

Telangana: తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సరయుపై కేసు నమోదు.. ఎందుకంటే
Sarayu
Ram Naramaneni
|

Updated on: Feb 06, 2022 | 1:58 PM

Share

Bigg Boss Telugu 5 Contestant Sarayu Roy: తన బోల్డ్ కామెంట్స్‌తో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్,  యూట్యూబ్‌ నటి సరయుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ హోటల్ ప్రచారపాటలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారన్నది ఆమెపై అభియోగం. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల విశ్వ హిందూ పరిషత్(Vishva Hindu Parishad) అధ్యక్షుడు చేపూరి అశోక్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాజన్న సిరిసిల్ల(Rajanna Sircilla) పోలీసులు.. ఆపై కేసును బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.  హోటల్‌ ప్రమోషన్ సాంగ్‌లో సరయుతో పాటు మరికొందరు గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ను తలకు ధరించారని అశోక్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవుడి బొమ్మలు ధరించి.. లిక్కర్ సేవించి హోటల్‌ను సందర్శిస్తారనే సంకేతాన్ని ఆ ప్రమోషన్ సాంగ్‌తో పంపుతున్నారని వెల్లడించారు. ఈ విధంగా ప్రవర్తించి హిందువుల మనోభావాలను కించపరినందుకు తగిన చర్యలు తీసుకోవాలని చేపూరి అశోక్ పోలీసులను కోరారు. ఇలాంటి చర్యలను హిందూ సమాజం సహించదన్నారు.

బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచిన వీజే సన్నీ హీరోగా నటించిన ‘సకల గుణాభిరామ’ మూవీ విడుదలకు సిద్దమువుతోంది. ఈ చిత్రం బిగ్ బాస్ ముందే ఆయన చేసినప్పటికి కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది.  త్వరలో  బ్యాలెన్స్ వర్క్  కంప్లీట్ చేసి రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో సరయు నటించింది.

Also Read: Telangana: గంజాయి పంట వేసిన రైతు.. రైతుబంధు కట్ చేసిన అధికారులు