Telangana: గంజాయి పంట వేసిన రైతు.. రైతుబంధు కట్ చేసిన అధికారులు

Cannabis: గంజాయి సాగు చేయొద్దన్న ప్రభుత్వ ఆదేశాలు పట్టంచుకోని ఓ రైతుకు అధికారులు షాక్ ఇచ్చారు. రైతుబంధు పథకం అర్హుల లిస్ట్ నుంచి అతని పేరు తొలగించారు.

Telangana: గంజాయి పంట వేసిన రైతు.. రైతుబంధు కట్ చేసిన అధికారులు
Ganja
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 06, 2022 | 12:29 PM

Rythu bandhu Stopped: గంజాయి సాగు చేయొద్దని తెలంగాణ సర్కార్(Telangana Government) రైతులను చాలాసార్లు రిక్వెస్ట్ చేసింది. అయినా కొందరు మాట వినకపోవడంతో పలుసార్లు హెచ్చరించింది. దీంతో చాలామంది రైతులు గంజాయి పంటను వేయడం మానేశారు. కానీ ఓ రైతు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదు. తన పంట పొలంలో గంజాయి(Ganja) సాగు చేశారు. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఆ రైతు పేరును రైతుబంధు పథకం అర్హుల లిస్ట్ నుంచి తొలగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM Kcr) కఠిన ఆదేశాలతో  మత్తు సాగు, రవాణాపై అధికారులు ఎంత తీవ్రంగా యాక్షన్ తీసుకుంటున్నారో తెలియడానికి ఇదో ఉదాహారణగా చెప్పవచ్చు. వివరాల్లోకి వెళ్తే… మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం మణికొండ ప్రాంతంలో చంద్రయ్య అనే రైతు గంజాయి సాగు చేస్తున్నాడు. అబ్కారీ, రెవెన్యూశాఖ అధికారుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. దీంతో ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో రైతుబంధు కింద వచ్చే 7500 రూపాయలు ఆ రైతుకు అందించొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు చంద్రయ్యను అర్హుల జాబితా నుంచి తొలగించారు. వచ్చే పంటకాలంలో పెట్టుబడి అందదించొద్దని ఆదేశించారు.

కాగా  రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామంలో ఏ రైతు గంజాయి సాగు చేస్తున్నట్టు రుజువైనా.. ఆ సమాచారం అందించకపోతే ఆ గ్రామానికి రైతు బంధు తదితర సబ్సిడీలు రద్దు చేస్తామని కూడా హెచ్చరికలు పంపారు. 5 సార్లకు మించి గంజాయి దొరికితే ఆ ఊరికి ప్రభుత్వం అన్ని రకాల సబ్సిడీలను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. గ్రామాల్లో గంజాయి సాగు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా గ్రామస్తుల మీద కూడా ఉందని సీఎం పేర్కొన్నారు.

Also Read: Nellore District: అతడో హెడ్ కానిస్టేబుల్.. ఏం స్మగ్లింగ్ చేస్తున్నాడో తెలిస్తే మీరు షాకవ్వడం ఖాయం