BJP vs TRS: 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎప్పుడు పెడతారు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బండి సంజయ్!
తెలంగాణలో కొత్త రాజ్యాంగం రచ్చ అంతకంతకూ పెరుగుతుందే తప్ప.. ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ వేడిని చల్లారకుండా చూస్తోంది బీజేపీ.
BJP Chief Bandi Sanjay Kumar: తెలంగాణ(Telangana)లో కొత్త రాజ్యాంగం(Constitution) రచ్చ అంతకంతకూ పెరుగుతుందే తప్ప.. ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ వేడిని చల్లారకుండా చూస్తోంది బీజేపీ(BJP). ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా రచ్చ చేస్తోంది. ఎన్టీఆర్ గార్డెన్ పక్కన హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో భారీ అంబేద్కర్ విగ్రహం(Ambedkar Statue) ఏర్పాటు పనుల్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. ఆరేళ్లు అయినా అంబేద్కర్ విగ్రహ పనులు ఎందుకు పూర్తి చేయడం లేదో సీఎం సమాధానం చెప్పాలన్నారు.
కేసీఆర్ అంబేద్కర్ని అవమానించారని బండి సంజయ్ విమర్శించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై 2016లో హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇప్పటికీ ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం లేదని విమర్శించారు. పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ జయంతి లోపు పనులు పూర్తి చేసి విగ్రహావిష్కరణ జరపాలని డిమాండ్ చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎప్పుడు పెడ్తవ్ కేసీఆర్ ? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం పదవి చేపట్టాక మొట్టమొదట మోసం చేసింది దళితులనేనని బండి సంజయ్ ఆరోపించారు.
ఈ రచ్చ జరుగుతున్న సమయంలోనే… ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు రావడం, సమతామూర్తిని ఆవిష్కరించడం జరిగిపోయింది. జ్వరం కారణంగా సీఎం కేసీఆర్.. ప్రధాని కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం మరో దుమారానికి కారణమైంది. అయితే, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆవిష్కరణ సరే.. మరి ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ ఎక్కడ? అని ప్రశ్నించడం మొదలెట్టింది టీఆర్‌ఎస్. సోషల్ మీడియాలో ఈ హ్యాష్ ట్యాగ్ టాప్ ప్లేస్‌లో బాగా ట్రెండైంది.
ఇవాళ ఇదే అంశంపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరలైంది. వివక్ష నిలువెత్తు నిదర్శనమైన వ్యక్తి… సమతామూర్తిని ఆవిష్కరించారంటూ… సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్. దీంతో, ఈక్వాలిటీ ఇష్యూ మరింత వేడెక్కింది. ఇక, కేటీఆర్ ట్వీట్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బర్నాల్ మూమెంట్ అంటూ.. మరింత సెటైరికల్‌గా రీ ట్వీట్ చేశారు.
‘Burnol’ moment https://t.co/r1149fpAgE
— Raja Singh (@TigerRajaSingh) February 6, 2022
Read Also… Statue of Equality: సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న పవన్‌కల్యాణ్.. ఆయన మహాసంకల్పం వల్లే అంటూ..