POLICE: యువతిని గదిలో బంధించిన పోలీసు.. 40రోజుల పాటు చిత్రహింసలు
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువతిపై ఏఎస్ఐ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో దుష్ట నివారణ పూజలు జరిపిస్తానని నమ్మించి 40 రోజులు ఇంట్లో బంధించి చిత్ర హింసలు పెట్టాడు.
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువతిపై ఏఎస్ఐ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో దుష్ట నివారణ పూజలు జరిపిస్తానని నమ్మించి 40 రోజులు ఇంట్లో బంధించి చిత్ర హింసలు పెట్టాడు. అతడి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి ఏఎస్ఐ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. పోలీసు ఉన్నతాధికారులు తెలిపిన వివరాలు ప్రకారం తమిళనాడు పళ్లికరణైలో ఓ యువతి నివసిస్తోంది. విదేశాల్లో ఉన్న ఆమె తల్లిదండ్రులు ఇటీవలే మృతి చెందడంతో ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తోంది. మిస్ చెన్నై పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరూ తెచ్చుకుంది.
ఈస్ట్ కోస్టు రోడ్డులో ఆమెకు చెందిన సొంత స్థలంలో ఇంటిని నిర్మిస్తామని ఓ బిల్డర్ మోసం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సదరు యువతి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ ఏఎస్‌ఐ ఆండ్రూ కార్వెల్‌తో పరిచయం ఏర్పడింది. కేసు విచారణ పేరుతో రోజూ ఆమెతో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. ఏఎస్ఐని నమ్మిన యువతి.. తన వ్యక్తిగత విషయాలనూ పంచుకుంది. తన ఇంట్లో సమస్యలు ఉన్నాయని, అందుకే తన తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయారని అతని వద్ద వాపోయింది.
ఆమె బలహీనతను అవకాశంగా తీసుకున్న కార్వెల్.. దుష్ట నివారణ పూజలు చేయిస్తానని నమ్మించాడు. తర్వాత కొంత మంది మత బోధకులను పిలిపించి పూజలు చేయించాడు. ఓ రోజు ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె తిరస్కరించడంతో గదిలో బంధించి 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టాడు. అతడి బారి నుంచి బాధితురాలు ఎలాగోలా బయటపడి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో ఉన్నతాధికారులు విచారణ జరిపి కార్వెల్ పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కార్వెల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇవీచదవండి.
Hyderabad News: అమ్మో.. ఈ దంపతులు మహా ముదుర్లు.. నమ్మించే నట్టేట ముంచారు.. ఏకంగా 2 కోట్లు..
Viral Video: అయ్యో పాపం.. ఎరక్కపోయి వచ్చి… ఇరుక్కుపోయింది
Telangana: లబోదిబోమంటున్న తెలంగాణ వేరుశనగ రైతులు.. పట్టించుకునే నాథుడేడి..?