AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇక కంపెనీ చుట్టూ తిరగకుండా ఆ పని మీరే చేసుకోవచ్చు

EPFO: ఉద్యోగికి పీఎఫ్‌ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ఉద్యోగం మారిన సమయంలో..

EPFO: పీఎఫ్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇక కంపెనీ చుట్టూ తిరగకుండా ఆ పని  మీరే చేసుకోవచ్చు
Subhash Goud
|

Updated on: Feb 06, 2022 | 7:48 AM

Share

EPFO: ఉద్యోగికి పీఎఫ్‌ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ఉద్యోగం మారిన సమయంలో ప్రావిడెంట్‌ ఫండ్‌ (PF)డబ్బుల కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కానీ మారుతున్న కాలానుగుణంగా ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా నిబంధనలలో మార్పులు చేసింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO). ఏ కంపెనీలోనైనా ఉద్యోగంలో చేరినప్పుడు, తర్వాత మానేసిన సమయంలో పీఎఫ్‌ డబ్బులు తీసుకోవాలంటే కంపెనీ హెచ్‌ఆర్‌ (HR)ను సంప్రదించాల్సి వచ్చేది. ఎందుకంటే సదరు ఉద్యోగి ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగం మానసిన తేదీలను ధృవీకరించిన తర్వాత పీఎఫ్‌ డబ్బులు తీసుకునే సదుపాయం ఉండేది. ఇప్పుడు అలాంటి నిబంధనపై ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం మానేసినా డబ్బులు తీసుకునే హక్కు ఉద్యోగికే కల్పించింది. అంటే కంపెనీ హెచ్‌ఆర్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉండకుండా ఉద్యోగే డబ్బులు తీసుకోవచ్చు.

ఈపీఎఫ్‌ఓ తెలిపిన వివరాల ప్రకారం… మీరు ఇటీవల ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లయితే మీరు విడిచిపెట్టిన తేదీని దాఖలు చేయడానికి రెండు నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పీఎఫ్‌లో కంపెనీ యజమాని చివరి పీఎఫ్‌ డబ్బులు వేసిన 2 నెలల తర్వాత మాత్రమే నవీకరించబడుతుంది.

అయితే మీరు ఏదైనా కంపెనీలో ఉద్యోగంలో నుంచి వెళ్లిపోయినట్లయితే తేదీని ధృవీకరించకపోతే పీఎఫ్‌ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోలేరు. అలాగే అకౌంట్‌ను మీరు చేరిన కొత్త కంపెనీకి బదిలీ చేసుకోలేరు. కానీ ఉద్యోగులే కంపెనీ నుంచి నిష్క్రమణ తేదీని నవీకరించే హక్కును కల్పించింది ఈపీఎఫ్‌ఓ. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. ఈ మధ్య కాలంలో పీఎఫ్‌ నిబంధనలలో చాలా మార్పులు వచ్చాయి. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే నిబంధనలు తీసుకువస్తోంది ఈపీఎఫ్‌ఓ. పీఎఫ్‌ నామినీని నమోదు చేయడం, పీఎఫ్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడం, పీఎఫ్‌ నుంచి రుణం తీసుకోవడం, పీఎఫ్‌ డబ్బులు క్లెయిమ్‌ చేసుకోవడం వంటి తదితర పనులన్ని ఉద్యోగే చేసుకునే సదుపాయం ఉంది.

నిష్క్రమణ తేదీని నవీరించడం ఎలా..?

మీరు ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పోర్టల్‌ను ఓపెన్‌ చేయాలి. తర్వాత మేనేజ్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి. డ్రాప్‌ డౌన్‌ మెనూలో Mark Exit అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అందులో పీఎఫ్‌ అకౌంట్‌ నంబర్‌ను ఎంచుకోండి. అందులో మీరు కంపెనీ నుంచి నిష్క్రమన తేదీ, అందుకు గల కారణాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్‌ నెంబర్‌కు లింక్‌ అయిన మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ (OTP)ని నమోదు చేయాలి. తర్వాత చెక్‌బాక్స్‌ను ఎంచుకుని అప్‌డేట్‌ చేయాలి. అంతే మీ పని విజయవంతంగా పూర్తవుతుంది.

ఇవి కూడా చదవండి:

Banking News: ఆ బ్యాంకు త్రైమాసిక ఫలితాలు విడుదల.. నికర లాభం రెండింతలు..!

Gold, Silver Price Today: గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. తాజా ధరల వివరాలు