Elections 2022: ఈసీ కీలక నిర్ణయం.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పార్టీలకు కాస్త ఊరట..

EC Extends Ban On Rallies: దేశంలోని ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు (Elections 2022) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. యూపీలో ఫిబ్రవరి 10న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి.

Elections 2022: ఈసీ కీలక నిర్ణయం.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పార్టీలకు కాస్త ఊరట..
Eci
Follow us

|

Updated on: Feb 07, 2022 | 6:00 AM

EC Extends Ban On Rallies: దేశంలోని ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు (Elections 2022) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. యూపీలో ఫిబ్రవరి 10న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం (ECI).. రాజకీయ పార్టీలకు కాస్త ఊరట కల్పించింది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో బహిరంగ సమావేశాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రోడ్ షోలు, పాదయాత్రలు, ఊరేగింపులపై నిషేధం కొనసాగుతుందని.. పార్టీలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇండోర్‌ లేదా బహిరంగ మైదానాల్లో సమావేశాలు నిర్వహించుకోవచ్చని.. కానీ అతి తక్కువ మందికే అనుమతినివ్వాలని తెలిపింది. ఈ సభలు, సమావేశాల కోసం జిల్లా ఎన్నికల పరిశీలకుల అనుమతి తీసుకోవాలని.. కరోనా (Coronavirus) మార్గదర్శకాలను పాటించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇండోర్‌ మైదానాల్లో 50 శాతం, బహిరంగ మైదానాల్లో 30 శాతం సీటింగ్‌ మేరకు మాత్రమే ప్రజలకు అనుమతి ఉంటుందని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. దీంతోపాటు ఇంటింటి ప్రచారానికి 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రచారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు చేసుకోవచ్చని తెలిపింది.

కాగా.. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో జరగనున్నాయి. ఉత్తరాఖండ్, గోవాలలో ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. పంజాబ్‌లో 20న ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్‌లో ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరగనుంది. కాగా.. ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3, మార్చి 7న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మార్చి 10న జరగనుంది.

Also Read:

Punjab Elections: పంజాబ్‌ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. ప్రకటించిన రాహుల్ గాంధీ

UP Election 2022: సీఎం యోగీ వద్ద రివాల్వర్‌.. ఇక నలుగురు మాజీ సీఎంల ఆస్తుల వివరాలు ఇవే..

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??