చనిపోయిన ఫ్రెండ్ రమ్మని పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా.. సెల్ టవర్ ఎక్కి హల్ చల్
పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. చనిపోయిన తన స్నేహితుడ పిలుస్తున్నాడంటూ సెల్ టవర్ ఎక్కాడు. దావీదు అనే యువకుడు సుమారు గంటన్నరపాటు టవర్ పైనే ఉండి స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేశాడు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. చనిపోయిన తన స్నేహితుడు పిలుస్తున్నాడంటూ సెల్ టవర్ ఎక్కాడు. దావీదు అనే యువకుడు సుమారు గంటన్నరపాటు టవర్ పైనే ఉండి స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేశాడు. అతడిని కిందికి దింపేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. యువకుడి కుమారుడిని ఎత్తుకుని చూపిస్తూ కిందికి రావాలని సూచించారు. దీంతో అతడు టవర్ దిగాడు. కిందికి దిగి వచ్చిన తర్వాత యువకుడికి పోలీసులు కౌన్సెలింగ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చనిపోయిన తన స్నేహితుడు రంజిత్ రమ్మని పిలుస్తున్నాడంటూ అతడు పోలీసులకు చెప్పడం విస్మయం కలిగించింది. దావీదును వైద్యులకు చూపించాలని కుటుంబ సభ్యులకు పోలీసులు సూచించారు.
ఇవీచదవండి.
German Renaissance Art: పెన్సిల్‌తో గీసిన ఆ బొమ్మ ఖరీదు 74 కోట్లు.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..
Manchu Vishnu: ‘సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ ఆయన పర్సనల్’.. మంచు విష్ణు సంచలన కామెంట్స్