German Renaissance Art: పెన్సిల్‌తో గీసిన ఆ బొమ్మ ఖరీదు 74 కోట్లు.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..

German Renaissance Art : లండన్‌(Londona)లోని ఓ వేలం సంస్థ పెన్సిల్‌తో గీసిన ఓ డ్రాయింగ్‌ను వేలానికి పెట్టింది. దాని ధర అక్షరాలా 74 కోట్లుగా నిర్ణయించింది. త్వరలో వేలానికి రాబోతున్న ఈ డ్రాయింగ్‌లో..

German Renaissance Art: పెన్సిల్‌తో గీసిన ఆ బొమ్మ ఖరీదు 74 కోట్లు.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..
German Renaissance Art
Follow us

|

Updated on: Feb 07, 2022 | 2:03 PM

German Renaissance Art: లండన్‌(Londona)లోని ఓ వేలం సంస్థ పెన్సిల్‌తో గీసిన ఓ డ్రాయింగ్‌ను వేలానికి పెట్టింది. దాని ధర అక్షరాలా 74 కోట్లుగా నిర్ణయించింది. త్వరలో వేలానికి రాబోతున్న ఈ డ్రాయింగ్‌లో అంత ప్రత్యేకత ఏముందనే అనుమానం వస్తుంది కదా… ఆ పెయింటింగ్ ఇప్పటిది కాదు మరి, దాన్ని 16వశతాబ్ధంలో జర్మన్ కళాకారుడు ఆల్బ్రెచ్ట్ డ్యూరర్ గీశారు. ఆయన 1529లో మరణించారు. అప్పట్లో ఆయన ప్రముఖ చిత్రకారుడు. ఆ తరువాత ఆ పెయింటింగ్ చేతులు మారిమారి చివరకు లండన్‌లోని ఓ పుస్తకాల దుకాణానికి చేరింది. ఆ దుకాణం యజమాని దానిని 2017లో 30 డాలర్లు పెట్టి కొనుక్కొని తన షాపులో పెట్టుకున్నాడు. 2019లో పుస్తకాలు కొనుక్కోడానికి ఆ షాపు వద్దకు వచ్చిన ఓ వ్యక్తి ఆ డ్రాయింగ్‌ను చూసి, అది చాలా పురాతనమైనదని గుర్తించాడు. ఎందుకంటే అతను పురాతన వస్తువులు సేకరించే వ్యక్తి. ఆ షాపు ఓనర్‌కు కొంత డబ్బు చెల్లించి ఆ డ్రాయింగ్‌ తీసుకున్నాడు. ఆ డ్రాయింగ్‌ చరిత్ర ఏంటో తెలుసుకోవాలనుకున్న ఆ వ్యక్తి దాదాపు పది దేశాలు తిరిగాడు. చివరికి అది 16 శతాబ్ధానికి చెందినదిగా తెలుసుకున్నాడు.

ఆ పెయింటింగ్ లో ఏ హంగూఆర్బాటం లేదు, ఓ మహిళ చేతిలో చంటి పిల్లతో ఉంది. ఆ చిత్రానికి ‘ద వర్జిన్ అండ్ చైల్డ్’ అని పేరు పెట్టారు. ఈ పెయింటింగ్ వయసు దాదాపు అయిదు వందల సంవత్సరాలకు పైమాటే. పురాతన వస్తువులకు వేలం పాటలో చాలా విలువ పలుకుతుంది. లండన్లో తరచూ ఇలాంటి ప్రాచీన వస్తువుల వేలం పాటలు సాగుతూనే ఉంటాయి. ప్రస్తుతానికి ఈ పెయింటింగ్ విలువను 74 కోట్లుగా నిర్ణయించారు కానీ ఇంకా వేలానికి పెట్టలేదు. అయితే అంత ఖరీదు పెట్టి ఈ పెన్సిల్ డ్రాయింగ్ ను ఎవరు కొనుక్కుంటారో చూడాలి.

View this post on Instagram

A post shared by Agnews (@agnewsgallery)

Also Read:  భారతీయుల దెబ్బకి దిగివచ్చిన హ్యుండయ్.. 25 ఏళ్ల బంధాన్ని మరచిపోమంటూ క్షమాపణలు..

Latest Articles